Best flagship smartphones : ప్రీమియం ఫీచర్స్‌తో వస్తున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది వాల్యూ ఫర్ మని?
Best flagship smartphones : రియల్మీ జీటీ 7 ప్రో వర్సెస్ వన్‌ప్లస్ 13.. త్వరలో లాంచ్‌కానున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్?
రాబోయే వారాల్లో రెండు దిగ్గజ సంస్థలకు చెందిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌కు రెడీ అవుతున్నాయి. అవి.. రియల్మీ జీటీ 7 ప్రో, వన్‌ప్లస్ 13! నవంబర్ 28న రియల్మీ గ్యాడ్జెట్ లాంచ్ అవుతుండగా, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఎప్పుడు లాంచ్ అయినా, రెండు గ్యాడ్జెట్స్ మధ్య తీవ్ర పోటీ ఖాయం! ఈ నేపథ్యంలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
రియల్మీ జీటీ 7 ప్రో వర్సెస్ వన్‌ప్లస్ 13..
డిస్ ప్లే: రియల్మీ జీటీ 7 ప్రో 6.78 ఇంచ్ 1.5కే 8టీ ఎల్టీపీఓ కర్వ్డ్ డిస్ప్లేతో రానుంది. ఈ డిస్ప్లే హెచ్డీఆర్ 10+, డాల్బీ విజన్, 2,600 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వంటి సపోర్ట్‌తో వస్తుంది. మరోవైపు వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్స్ 6.82 ఇంచ్ 2కే+ అమోఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉండవచ్చు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి డిస్ప్లే మేట్ ఏ++ రేటింగ్‌తో వస్తుంది.
కెమెరా: రియల్మీ జీటీ 7 ప్రో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండనుంది.
వన్‌ప్లస్ 13 ట్రిపుల్ కెమెరా సెటప్తో రానుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా. ఇందులో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండే అవకాశం ఉంది.
పర్ఫార్మెన్స్: రియల్మీ జీటీ 7 ప్రో- వన్‌ప్లస్ 13 రెండూ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. భారత్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ 16 జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 1 టీబీ యూఎఫ్ఎస్ 4.0 వరకు స్టోరేజ్‌ని అందించే అవకాశం ఉంది. అయితే వన్‌ప్లస్ 13 చైనా వేరియంట్ 24 జీబీ ర్యామ్‌ని అందిస్తోంది. అదనంగా, రెండు పరికరాలు ఏఐ ఫీచర్లు- టూల్స్‌ను అందించవచ్చు.
బ్యాటరీ: భారతదేశంలో, రియల్మీ జీటీ 7 ప్రో 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. వన్‌ప్లస్ 13లో 100వాట్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనుంది.
ధర: చైనాలో రియల్మీ జీటీ 7 ప్రో ప్రారంభ ధరను 3,699 యువాన్లుగా(సుమారు రూ.44,000) ప్రకటించింది. వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్‌ని 4,499 యువాన్లుగా(రూ.53,000) నిర్ణయించారు. కాబట్టి, రియల్మీ జీటీ 7ప్రో కంటే వన్‌ప్లస్ 13 ఖరీదైనది.
సంబంధిత కథనం