NTPC Green Energy IPO : ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా?ఇలా చెక్​ చేసుకోండి..-ntpc green energy ipo allotment date likely today gmp how to check status ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ntpc Green Energy Ipo : ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా?ఇలా చెక్​ చేసుకోండి..

NTPC Green Energy IPO : ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా?ఇలా చెక్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Nov 23, 2024 11:20 AM IST

NTPC Green Energy IPO GMP : ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ శనివారం లైవ్​ అయ్యే అవకాశం ఉంది. మీకు అలాట్​ అయ్యిందా? లేదా? అన్నది ఎలా తెలుసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా?
ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ మీకు అలాట్​ అయ్యిందా? (Photo: Courtesy company website)

మచ్​ అవైటెడ్​ ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ నేడు లైవ్​ అయ్యే అవకాశం ఉంది. 'టీ+3' లిస్టింగ్ నిబంధన నేపథ్యంలో ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ లిస్టింగ్ తేదీ 2024 నవంబర్ 27, అంటే వచ్చే వారం బుధవారం అవ్వొచ్చు. కాబట్టి, ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కేటాయింపు తేదీ 23 నవంబర్ 2024, అంటే ఈ రోజు అవ్వాలి. ఆలస్యమైతే వచ్చే వారం సోమవారం వాటా కేటాయింపు ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ కేటాయింపు వెలువడిన తర్వాత, దరఖాస్తుదారులు బీఎస్​ఈ వెబ్సైట్ లేదా పబ్లిక్ ఇష్యూ అధికారిక రిజిస్ట్రార్ అయిన కెఫిన్ టెక్నాలజీస్ అధికారిక వెబ్సైట్​లో అలాట్​మెంట్​ స్టేటస్​ని చెక్​ చేసుకోవచ్చు.

ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ జీఎంపీ

మార్కెట్​లో ఎన్​టీపీసీ గ్రీన్​ ఎనర్జీ గ్రే మార్కెట్​ ప్రీమియం నేడు రూ.2 గా ఉంది, శుక్రవారం (రూ.0) తో పోలిస్తే ఇది రూ.2 ఎక్కువ! గ్రే మార్కెట్ సెంటిమెంట్ పెరగడానికి భారత స్టాక్ మార్కెట్ ట్రెండ్ రివర్స్ కావడమే కారణమని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు. దలాల్ స్ట్రీట్ సూచీలు శుక్రవారం మంచి పుల్ బ్యాక్ ర్యాలీని చూశాయని వారు తెలిపారు. సెకండరీ మార్కెట్ ప్రస్తుత ఆటుపోట్లను కొనసాగిస్తే ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు సంబంధించి గ్రే మార్కెట్ సెంటిమెంట్లు మరింత మెరుగుపడతాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ సబ్​స్క్రిప్షన్ స్టేటస్..

మూడు రోజుల ఐపీఓ బిడ్డింగ్ తర్వాత ఈ పబ్లిక్ ఇష్యూ 2.42 సార్లు బుక్​ అయ్యింది. రిటైల్ పార్ట్ 3.44 సార్లు, ఎన్​ఐఐ సెగ్మెంట్ 0.81 సార్లు, క్యూఐబీ సెగ్మెంట్ 3.32 సార్లు సబ్​స్క్రైబ్ అయ్యాయి.

ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ని ఇలా చెక్​ చేసుకోండి..

1] డైరెక్ట్ బీఎస్​ఈ లింక్ వద్ద లాగిన్ అవ్వండి- bseindia.com/investors/appli_check.aspx;

2. ఇష్యూ టైప్ ఆప్షన్స్​లో 'ఈక్విటీ' ఎంచుకోండి.

3. అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయితే 'ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్' కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి.

4] మీ అప్లికేషన్ నంబర్ లేదా పాన్ కార్డు వివరాలను సబ్మీట్​ చేయండి.

5] 'నేను రోబోను కాదు' పై క్లిక్ చేయండి.

6] 'సెర్చ్' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ మీ కంప్యూటర్ మానిటర్ లేదా మొబైల్ ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తుంది.

కెఫిన్​టెక్ ద్వారా..

1] డైరెక్ట్ కెఫిన్​టెక్ వెబ్ లింక్​లో (kosmic.kfintech.com/ipostatus.) లాగిన్ అవ్వండి.

2. 'ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్'ను ఎంచుకోండి.

3. 'అప్లికేషన్ నెంబర్, డీమ్యాట్ అకౌంట్ లేదా పాన్'లో ఏదో ఒకదాన్ని ఎంచుకోండి.

4] అప్లికేషన్ నెంబరు ఎంటర్ చేయండి.

5] క్యాప్చాను ఎంటర్ చేయండి.

6] 'సబ్మిట్' బటన్ మీద క్లిక్ చేయండి.

మీ ఎన్​టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ అలాట్​మెంట్​ స్టేటస్​ స్క్రీన్​పై కనిపిస్తుంది.

ఇవాళ లేదా సోమవారం అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అవ్వొచ్చని గుర్తుపెట్టుకోండి.

Whats_app_banner

సంబంధిత కథనం