OnePlus Diwali Sale : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్, ప్యాడ్స్‌పై క్రేజీ డిస్కౌంట్లు..
OnePlus Diwali 2024 Sale date : వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్, ప్యాడ్స్‌పై క్రేజీ డిస్కౌంట్లు లభించనున్నాయి. వన్‌ప్లస్ దివాళీ 2024 సేల్ డేట్, ఆఫర్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ తన దీపావళి 2024 సేల్‌ని ప్రకటించింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్, టాబ్లెట్లు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా వివిధ ప్రాడక్ట్స్‌పై డిస్కౌంట్లు లభిస్తాయి. సెప్టెంబర్ 26, 2024 నుంచి డిస్కౌంట్ వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.
వన్‌ప్లస్ దీపావళి 2024 సేల్: డేట్..
వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియెన్స్ స్టోర్స్, అమెజాన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, క్రోమా వంటి ఇతర రిటైల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ వన్‌ప్లస్ దీపావళి సేల్ అందుబాటులో ఉంటుంది. ప్రైమ్ సబ్స్క్రైబర్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సెప్టెంబర్ 26న ప్రారంభం కానుంది. 27న అందరికి అందుబాటులోకి వస్తుంది.
వన్ ప్లస్ దీపావళి సేల్ ఆఫర్లు: డిస్కౌంట్స్..
దీపావళి సేల్ సందర్భంగా వన్‌ప్లస్ పలు రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించనుంది. వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12ఆర్, వన్‌ప్లస్ నార్డ్ 4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4, వన్‌ప్లస్ నార్డ్ సీఈ4 లైట్ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో ఉన్నాయి. ఫోన్లతో పాటు వన్‌ప్లస్ ఓపెన్ అపెక్స్ ఎడిషన్, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ ప్యాడ్ గో, వన్‌ప్లస్ వాచ్ 2, వన్‌ప్లస్ బడ్స్ 3 ఫోన్లపై ఈ సేల్‌లో అదిరిపోయే డిస్కౌంట్స్ లభించనున్నాయి.
ఇదీ చూడండి:- iPhone 16 Pro : మీ ఐఫోన్ 16 ప్రో టచ్‌స్క్రీన్ సరిగ్గా పనిచేయడం లేదా? కొన్న కొన్ని రోజులకే..!
బ్యాంక్ ఆఫర్లు, కూపన్లు, స్టూడెంట్ డిస్కౌంట్ల ద్వారా మరిన్ని డిస్కౌంట్లను కంపెనీ అందించనుంది. రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులు, అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేసే వారు ఎంపిక చేసిన ఉత్పత్తులపై ఎక్స్‌క్లూజివ్ డీల్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.
ఆఫర్ల పరంగా వన్‌ప్లస్ 12 కొనుగోలుదారులకు అదనపు ఖర్చు లేకుండా వన్‌ప్లస్ బడ్స్ ప్రో 2 లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ4ను కొనుగోలు చేసే వినియోగదారులకు వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఉచితంగా లభిస్తుంది! వన్‌ప్లస్ సీఈ4 లైట్ కొనుగోలు చేసేవారికి వన్‌ప్లస్ బుల్లెట్స్ వైర్లెస్ జెడ్2 ఇయర్‌బడ్స్ అందించనున్నారు. అదనంగా, వన్‌ప్లస్ ఓపెన్ కొనుగోలుదారులకు వన్‌ప్లస్ వాచ్ 2, వన్‌ప్లస్ ప్యాడ్ గో కొనుగోలుదారులకు ఫోలియో కేస్ ఉచితంగా లభిస్తుంది.
ఈ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్ 12 లేదా వన్‌ప్లస్ 12ఆర్ కొనుగోలు చేసిన వారు వన్‌ప్లస్ బడ్స్ 3, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 పై అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్‌ని చెక్ చేయవచ్చు.
సంబంధిత కథనం