iPhone 16 Pro : మీ ఐఫోన్ 16 ప్రో టచ్‌స్క్రీన్ సరిగ్గా పనిచేయడం లేదా? కొన్న కొన్ని రోజులకే..!
iPhone 16 Pro touchscreen issue : రూ. 1లక్ష కన్నా ఎక్కువ ఖర్చు చేసి మీరు కొత్తగా కొన్న ఐఫోన్ 16 ప్రోలో టచ్‌స్క్రీన్ సమస్యలు ఎదుర్కొంటున్నారా? కంగారు పడకండి! చాలా మందికి ఈ సమస్య వస్తోంది. ఇదొక సాఫ్ట్వేర్ బగ్ అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే..
ఐఫోన్ 16 సిరీస్‌ని ఈ నెల మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ చేసింది దిగ్గజ యాపిల్ సంస్థ. సెప్టెంబర్ 20న ఇండియాలో సేల్స్ మొదలైనప్పుడు, యాపిల్ లవర్స్ గంటల తరబడి క్యూలో నిలబడి ఐఫోన్ 16ని సొంతం చేసుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఐఫోన్ 16 ప్రోతో ఇప్పుడు చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్ పనిచేయడం లేదని ఆన్లైన్ వేదికగా ఫిర్యాదులు పెరిగిపోతున్నాయి.
ఐఫోన్ 16 ప్రోలో టచ్‌స్క్రీన్ సమస్యలు..!
9టు5మ్యాక్ నివేదిక ప్రకారం చాలా మంది ఐఫోన్ 16 ప్రోలో వినియోగదారులు టచ్‌స్క్రీన్ సమస్యను ఎదుర్కొంటున్నారు. ట్యాప్స్, స్వైప్స్ సరిగ్గా పనిచేయడం లేదు. స్క్రోలింగ్, టైపింగ్ కూడా పేలవంగానే ఉంది.
అయితే ఐఫోన్ 16 ప్రోలో టచ్‌స్క్రీన్ సమస్యతు సాఫ్ట్వేర్ బగ్ కారణం అయ్యుండొచ్చని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అతి సున్నితమైన టచ్ రిజెక్షన్ అల్గారిథమ్ కారణంగా ఈ సమస్య వచ్చి ఉండవచ్చని నివేదిక సూచిస్తుంది. ఇది టచ్ సరిగ్గా పనిచేయకపోవడానికి కారణమవుతోంది. సాఫ్ట్వేర్ అప్డేట్తో ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
ఇదీ చూడండి:- Samsung Phone Discount : శాంసంగ్ 5జీ ఫోన్‌పై సూపర్ డీల్.. రూ.5 వేల డిస్కౌంట్‌తో కొనుగోలు చేసే ఛాన్స్
లాక్ స్క్రీన్‌పై టచ్‌స్క్రీన్ స్పందించకపోగా, ఫోన్ అన్‌లాక్ అయినప్పుడు, యూజర్ హోమ్ స్క్రీన్ పేజీల మధ్య స్వైప్ చేస్తున్నప్పుడు లేదా యాప్స్ ద్వారా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు ఈ సమస్య కనిపిస్తోంది. ఫలితంగా ఈ సమస్య హార్డ్‌వేర్‌కు సంబంధించినది కాదని సాఫ్ట్‌వేర్‌కు సంబంధించినదనే నమ్మకానికి మరింత బలం చేకూరుస్తోంది.
ఐఓఎస్ 18, ఐఓఎస్ 18.1 బీటా రెండింటినీ కలిగి ఉన్న ఐఫోన్ 16 ప్రో వినియోగదారులు ఈ సమస్యపై ఆన్లైన్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. యాపిల్ ఇంకా ఈ సమస్యను పరిష్కరించలేదు. కానీ కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్తో సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది.
యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. సెప్టెంబర్‌లో జరిగే ఐఫోన్ లాంచ్ ఈవెంట్స్ కోసం చాలా నెలల ముందు నుంచే యాపిల్ లవర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక లాంచ్ తర్వాత, కొత్త ఐఫోన్స్‌ని ఎప్పుడెప్పుడు కొనుగోలు చేస్తామని అని చూస్తుంటారు. కానీ మచ్ అవైటెడ్ ఐఫోన్ 16 ప్రోలో కొన్ని రోజులకే సమస్యలపై ఫిర్యాదులు అందుతుండటంపై యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీన్ని త్వరగా పరిష్కరించాలని అభిప్రాయపడుతున్నారు.
ఐఫోన్ 16 ప్రో ధర..
ఇండియాలో ఐఫోన్ 16 ప్రో 128 జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ. 1,19,900 నుంచి ప్రారంభమవుతుంది. 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధరలు వరుసగా రూ.1,29,900, రూ.1,49,900, రూ.1,69,900 గా ఉన్నాయి.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..
సంబంధిత కథనం