Loan In 6 Minutes : ఈ ప్రభుత్వ రంగ సంస్థలో ఎలాంటి పేపర్స్ లేకుండా 6 నిమిషాల్లో లోన్ తీసుకోవచ్చు
ONDC Loans : ఎక్కడైనా లోన్ కావాలి అంటే నానా తంటాలు పడాలి. ఒక్క పేపర్ లేకపోయినా లోన్ రిజక్ట్ అవుతుంది. అయితే ఓఎన్‌డీసీలో మీరు ఎలాంటి పత్రాలు లేకుండానే అప్పు తీసుకోవచ్చు. అది కూడా 6 నిమిషాల్లోనే మీ వచ్చేస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం ఏంటో తెలుసుకుందాం..
చాలాసార్లు అత్యవసర రుణ అవసరాలు ఉంటాయి. ఆ సమయంలో రుణం తిరిగే టైమ్ ఉండదు. ఎవరి దగ్గరో అధిక వడ్డీకి అప్పు తెచ్చుకుంటాం. తర్వాత దానిని తీర్చలేక ఇల్లు, వాకిలి అమ్మేస్తుంటాం. చిన్న మొత్తం అయితే పక్కింటి వారి దగ్గర తీసుకోవచ్చు. ఒక్కోసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకులకు వెళ్లాలి. అత్యవసర ఆర్థిక అవసరాలను తీర్చడానికి వ్యక్తిగత రుణం అవసరం. బ్యాంకుల రూల్స్, అడిగే పత్రాలు చూసి ఖాతాదారులు అయోమయానికి గురవుతారు. ఇకపై మీకు అలాంటి సమస్య లేకుండా ప్రభుత్వ రంగ సంస్థలో లోన్ తీసుకోవచ్చు.
6 నిమిషాల్లోనే
కేవలం 6 నిమిషాల్లో రుణాలు అందించేందుకు ప్రభుత్వ సంస్థ అయిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) ఉంది. ఆగస్టు 22న ఈ సర్వీస్ మెుదలైంది. సులభంగా రుణాలను అందించడం ద్వారా అవసరమైన వారికి సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఓఎన్‌డీసీ 31 డిసెంబర్ 2021న ప్రారంభించారు. ఈ ప్లాట్‌ఫారమ్ ఇప్పటివరకు దేశంలోని 1000 నగరాలు, పట్టణాలతో కనెక్ట్ చేసి ఉంది. అన్ని బ్యాంకులు, ఫైనాన్షియర్‌లు ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌కు యాక్సెస్ కలిగి ఉంటారు. ఓఎన్‌డీసీ ఆగస్ట్ 22న రుణం పంపిణీ సేవను మెుదలుపెట్టింది. ఇది పూర్తిగా డిజిటల్, పేపర్‌లెస్ అన్నమాట. మీ లోన్ కేవలం 6 నిమిషాల్లో ఆమోదిస్తారు.
పేపర్‌లెస్ లోన్
దరఖాస్తుదారులు ఎటువంటి భౌతిక పత్రాలు లేకుండా వారి ఇంటి నుండి మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఈ వ్యవస్థ లోన్ ప్రాసెసింగ్‌కు అవసరమైన సమయాన్ని తగ్గిస్తుంది. డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ క్రెడిట్ కార్డ్‌లు, బీమా ఉత్పత్తులు, మ్యూచువల్ ఫండ్‌లు, రైతులకు, విద్యార్థులకు రుణాలు వంటి వివిధ ప్రయోజనాల కోసం ఆన్‌లైన్ రుణాలను అందిస్తుంది.
లోన్ కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో నిర్దిష్ట పత్రాలను సమర్పించాలి. KYC ధృవీకరణ కోసం ఆధార్ కార్డ్ లేదా డిజిలాకర్ అవసరం. ఇ-సంతకం, e-NACHతో ఖాతా లింక్‌ను కలిగి ఉంటుంది. ఈ అవసరమైన పత్రాలతో ఏ వ్యక్తి అయినా ఇంట్లో కూర్చొని రుణం కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ బ్యాంకులు ఆసక్తి
ఆదిత్య బిర్లా ఫైనాన్స్, టైరెప్లెక్స్, క్లినిక్360, కర్ణాటక బ్యాంక్, డీఎంఐ ఫైనాన్స్, టాటా డిజిటల్, ఈజీపే, IndiPay, ఇన్‌వాయిస్‌పేతో సహా ఇప్పటివరకు తొమ్మిది కంపెనీలు ఓఎన్‌డీసీలో నమోదు చేసుకున్నాయి. ఈ పథకంలో చేరేందుకు అనేక బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. వీటిలో ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, MobiKwik, రూపేబాస్, టాటా క్యాపిటల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ ఫైనాన్స్ ఉన్నాయి.
జీఎస్టీ ఇన్‌వాయిస్ క్రెడిట్
మరోవైపు జీఎస్టీ ఇన్‌వాయిస్ క్రెడిట్ సదుపాయాన్ని సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభించాలని కంపెనీ ONDC అనుకుంటోంది. దీంతో చిన్న పారిశ్రామికవేత్తలు అవసరమైన సమయంలో త్వరగా రుణాలు పొందగలుగుతారు. ONDC ఈ కొత్త చొరవ వివిధ రంగాలకు చెందిన అనేక మంది వ్యక్తులు, వ్యాపారాలకు రుణాలు పొందడాన్ని సులభతరం చేస్తుంది. వేగంగా రుణాలు పొందవచ్చు.
టాపిక్