TG Indiramma Housing Scheme : త్వరలోనే ఇళ్ల మంజూరు పత్రాలు...! 'ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్'పై కీలక ప్రకటన
- Telangana Indiramma Indlu Scheme : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కించే పనిలో ఉంది. ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించగా… అందులో ఒకటిగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కూడా ఉంది. ఇందుకు సంబంధించిన ఇళ్ల మంజారు పత్రాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
- Telangana Indiramma Indlu Scheme : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… ఆరు గ్యారెంటీలను పట్టాలెక్కించే పనిలో ఉంది. ఇప్పటికే పలు పథకాలను ప్రారంభించగా… అందులో ఒకటిగా ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కూడా ఉంది. ఇందుకు సంబంధించిన ఇళ్ల మంజారు పత్రాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
(1 / 6)
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే.
(2 / 6)
ఈ స్కీమ్ ను మార్చి 11వ తేదీన భద్రాచలం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 22 వేల 500 కోట్ల బడ్జెట్ తో నాలుగున్నర లక్షల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో ప్రక్రియ కాస్త ఆలస్యమైంది.
(3 / 6)
గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ వచ్చాయి. ఏకంగా వీటి సంఖ్య 82.82 లక్షలుగా ఉంది ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది.
(4 / 6)
ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధివిధానాలను కూడా అధ్యయనం చేస్తోంది. తుది నివేదిక రాగానే లబ్ధిదారులను గుర్తించనున్నారు.
(5 / 6)
ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షలు అందిస్తారు. సొంత జాగాలో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి నమూనాలు, డిజైన్లను తయారు చేయించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
ఇతర గ్యాలరీలు