తెలుగు న్యూస్ / ఫోటో /
Election Comission KYC APP : మీ దగ్గర పోటీ చేసే అభ్యర్థి గురించి తెలుసా..? ఇలా చేస్తే పూర్తి సమాచారం మీ చేతిలోనే.!
- ECI Know Your Candidate App : ఎన్నికల సంఘం మరో అడుగు ముందుకేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఓ కొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది. ‘నో యువర్ క్యాండిడేట్ (KYC)’ పేరుతో దీన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి…

(1 / 5)
ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈసారి వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి ఈసీ సరికొత్త మొబైల్ యాప్ తీసుకొచ్చింది.
(2 / 5)
అభ్యర్థుల బయోడేటాతో పాటు నమోదైన కేసులు, నేర చరిత్ర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ‘నో యువర్ క్యాండిడేట్ (Know Your Candidate App)’ పేరుతో ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.
(3 / 5)
ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులతో పాటు ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా మీ నియోజకవర్గంలో పోటీపడుతున్న అభ్యర్థుల గురించి పూర్తి వివరాలను తెలుసుకునే వీలు ఉంటుంది.
(4 / 5)
అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికి ఓటేయాలనే దానిపై సదరు ఓటర్ కు స్పష్టత వస్తుందని… సరైన అభ్యర్థిని ఎన్నుకునే వీలు కలుగుతుందని ఈసీ చెబుతోంది.
ఇతర గ్యాలరీలు