Ola electric bike : లాంచ్​కి రెడీ అవుతున్న ఓలా ఎలక్ట్రిక్​ బైక్​- ఎలా ఉండబోతోంది?-olas electric motorcycle teased ahead of official unveil ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric Bike : లాంచ్​కి రెడీ అవుతున్న ఓలా ఎలక్ట్రిక్​ బైక్​- ఎలా ఉండబోతోంది?

Ola electric bike : లాంచ్​కి రెడీ అవుతున్న ఓలా ఎలక్ట్రిక్​ బైక్​- ఎలా ఉండబోతోంది?

Sharath Chitturi HT Telugu
Aug 10, 2024 11:15 AM IST

Ola electric motorcycle : ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ లాంచ్​కు రెడీ అవుతోంది. ఆగస్ట్​ 15 లాంచ్​కి ముందు, ఈ బైక్​కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటకి వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఓలా ఎలక్ట్రిక్​ బైక్
ఓలా ఎలక్ట్రిక్​ బైక్

ఐపీఓతో స్టాక్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఇప్పుడు తన తొలి ఎలక్ట్రిక్​ బైక్​పై ఫోకస్​ చేసింది. ఓలా ఎలక్ట్రిక్​ వార్షిక ఈవెంట్​ను ఆగస్టు 15న నిర్వస్తున్నట్టు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ ఈవెంట్ లో బ్రాండ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్​ని ఆవిష్కరించనుంది. ఈ మోటార్ సైకిల్ గతంలో ప్రదర్శించిన రోడ్​స్టర్ ప్రొడక్షన్ వెర్షన్ అవుతుంది. వాస్తవానికి, బ్రాండ్ మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను ప్రదర్శించింది. వాటిల్లో ఏది ప్రొడక్షన్​కి ముందు వెళుతుందో చూడాలి. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్​ బైక్​ గురించి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా ఎలక్ట్రిక్​ బైక్​..

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ రాబోయే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్​పై టెస్ట్ రైడ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. కానీ బైక్​కి సంబంధించిన ముఖ్యమైన వివరాలను దాచిపెట్టారు. అధికారిక లాంచ్ వరకు దాని వేరియంట్, ప్రొడక్షన్-రెడీ రూపాన్ని చూపించకుండా సంస్థ జాగ్రత్త తీసుకుంటోంది. ఏదేమైనా, ఎలక్ట్రిక్ వాహన తయారీదారు మోటార్ సైకిల్​కి సంబంధించి వివిధ డిజైన్ టార్గెట్స్​ని హైలైట్ చేసే నాలుగు ఫొటోలను విడుదల చేసింది. ఈ చిత్రాలలో హెడ్ లైట్లతో పాటు సీటు, టెయిల్ లైట్లను కలిగి ఉన్న ఫ్రంట్ సెక్షన్ కనిపిస్తోంది.

ఇంతకుముందు, ఓలా ఎలక్ట్రిక్ రాబోయే ఎలక్ట్రిక్ బైక్​ కోసం హెడ్​లైట్​ ప్రివ్యూను అందించింది. ఈ మోడల్​కు సంబంధించిన ట్విన్-పాడ్ ఎల్ఈడీ హెడ్​లైట్​, విలక్షణమైన రేర్​ వ్యూ మిర్రర్​ని బహిర్గతం చేసింది. ఇప్పటివరకు కంపెనీ ఆవిష్కరించిన డిజైన్ అంశాల ఆధారంగా, ఓలా మొదట మోటార్ సైకిల్ స్ట్రీట్ నేకెడ్ వెర్షన్​ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాబోయే ఓలా ఎలక్ట్రిక్ బైక్​ స్పెసిఫికేషన్లకు సంబంధించి పరిమిత సమాచారం అందుబాటులో ఉంది. కాగా సంస్థ సొంతంగా తయారు చేస్తున్న బ్యాటరీలను ఇందులో వాడుతున్నట్టు చెప్పింది. బ్యాటరీ తయారీ కోసం సంస్థ ప్రత్యేకంగా దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు తమ విభాగంలో అతిపెద్ద బ్యాటరీని కలిగి ఉంటాయని, పోటీదారులతో పోలిస్తే ఇవి మెరుగైన శ్రేణిని అందిస్తాయని భవిష్ అగర్వాల్ గతంలో సూచించారు.

ఓలా ఎలక్ట్రిక్ గత సంవత్సరం ఈ ఎలక్ట్రిక్ బైక్​ కాన్సెప్ట్ వెర్షన్​ని ప్రవేశపెట్టింది. రోడ్​స్టర్​, అడ్వెంచర్, క్రూయిజర్, డైమెండ్​ హెడ్​ అనే నాలుగు విభిన్న వేరియంట్లను పరిచయం చేసింది. అన్ని మోడళ్లను ఒకే ప్లాట్​ఫామ్​పై నిర్మించనుంది సంస్థ. ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ కాన్సెప్ట్​ను డైమండ్ హెడ్ పునర్నిర్వచించనున్నట్లు ఓలా తెలిపింది.

ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ..

ఇక ఓలా ఎలక్ట్రిక్​ ఐపీఓ విషయానికి వస్తే, శుక్రవారం స్టాక్​ మార్కెట్​లో లిస్ట్​ అయ్యింది. బీఎస్​ఈ సెన్సెక్స్​లో రూ. 75.99 వద్ద , ఎన్​ఎస్​ఈ నిఫ్టీలో వద్ద రూ. 76 వద్ద ఓపెన్​ అయ్యాయి. ఇది ఐపీఓ సమయంలో నిర్ణయించిన అప్పర్​ బ్యాండ్​తో సమానం. అంటే లిస్టింగ్​ ఫ్లాట్​గా అయినట్టు. కానీ ట్రేడింగ్​ సెషన్​ చివరి నాటికి రూ. 91 వద్ద ఓలా ఎలక్ట్రిక్​ షేర్లు క్లోజ్​ అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం