Nifty Bank F&O expiry : నిఫ్టీ బ్యాంక్ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీలో మార్పులు..
Nifty Bank F&O contracts expiry : నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ డేను గురువారం నుంచి శుక్రవారానికి మార్చింది ఎన్ఎస్ఈ. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
Nifty Bank F&O contracts expiry day : బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ(ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీలో కీలక మార్పులు చేసింది ఎన్ఎస్ఈ. ఇప్పటివరకు గురువారంగా ఉన్న కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీని శుక్రవారానికి మార్చుతున్నట్టు పేర్కొంది. ఈ కొత్త రూల్ జులై 14 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌ను విడుదల చేసింది.
"బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ కాంట్రాక్టుల ఎక్స్పైరీని గురువారం నుంచి శుక్రవారనికి మారుస్తున్నాము. ఇది జులై 7 నుంచి అమల్లోకి వస్తుంది. అయితే తొలి ఫ్రైడే ఎక్స్పైరీ మాత్రం జులై 14న జరుగుతుంది," అని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెల్లడించింది. ఒక వేళ శుక్రవారం సెలవు వస్తే.. ముందు ట్రేడింగ్ సెషన్లో ఎక్స్పైరీ ఉంటుంది.
గురువారం నుంచి షిఫ్ట్..
ప్రస్తుతం నిఫ్టీ బ్యాంక్ వీక్లీ కాంట్రాక్ట్స్ గురువారం ఎక్స్పైర్ అవుతున్నాయి. నెలవారీ, క్వార్టర్లీ కాంట్రాక్ట్స్.. సంబంధిత నెల చివరి గురువారం ఎక్స్పైర్ అవుతున్నాయి.
తాజా ప్రకటనతో జులై 6న జరగాల్సిన నిఫ్టీ బ్యాంక్ ఎక్స్పైరీ.. శుక్రవారానికి వాయిదా పడుతుంది. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టుల ఎక్స్పైరీ.. జులై 13 (గురువారం)గా ఉంటే.. అది జులై 14 (శుక్రవారం)కు వాయిదా పడుతుంది.
గత నిబంధనల ప్రకారం.. 2023 ఆగస్టులో బ్యాంక్ నిఫ్టీ ఎఫ్ అండ్ ఓ ఎక్స్పైరీ ఆ నెల 31న జరగాల్సి ఉంది. తాజా రూల్స్ ప్రకారం.. అది ఆగస్టు 25నే జరుగుతుంది.
స్టాక్ మార్కెట్లంటేనే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఇక ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చాలా రిస్కీ అని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతుంటారు.
ఎన్ఎస్ఈకి పోటీగా.. గత నెలలో బీఎస్ఈ సైతం కాంట్రాక్ట్స్ను ప్రవేశపెట్టింది. వీటి లాట్ సైజ్ చాలా తక్కువగా ఉంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఒక్క షేరు కొనుగోలు చేయవచ్చు. కానీ ఎఫ్ అండ్ ఓలో ‘లాట్స్’ అని ఉంటాయి. లాట్స్‌లో 100కుపైగా షేర్లు ఉంటాయి.
స్టాక్ మార్కెట్ టుడే..
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 156 పాయింట్లు కోల్పోయి 62,631 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 18,552 వద్ద ట్రేడ్ అవుతోంది.
సంబంధిత కథనం