New Credit Card Rules : షాక్ ఇచ్చిన బ్యాంక్‌లు- ఇక క్రెడిట్ కార్డులపై మరింత భారం తప్పదా?
New Credit Card Rules : ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు.. తమ క్రెడిట్ కార్డ్ కొత్త రూల్స్‌ని అమల్లోకి తీసుకొచ్చాయి. రివార్డ్ పాయింట్స్, ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కీలక మార్పులు వచ్చాయి. ఇవి కస్టమర్‌పై మరింత భారం వేసేలా ఉన్నాయి!
నవంబర్ 1 నుంచి నూతన క్రెడిట్ కార్డు రూల్స్ అమల్లోకి వచ్చాయ. పలు బ్యాంకుల రివార్డ్ పాయింట్స్, బిల్ పేమెంట్స్, వడ్డీ రేట్లల్లో కీలక మార్పులు కనిపిస్తాయి. వీటి గురించి వినియోగదారులకు కచ్చితంగా అవగాహన ఉండాలి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఎస్బీఐ కార్డ్స్‌లో కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్..
పాయింట్స్ వాలిడిటీ:- ఎస్బీఐ కార్డ్‌లో రివార్డ్ పాయింట్స్ వాలిడిటీ మారింది. ఇక నుంచి ఇవి లిమిటెడ్ పీరియడ్ మాత్రమే వాలిడ్‌గా ఉంటాయి. సమయానికి ముందే వీటిని ఉపయోగించుకోవాలి.
ఈఎంఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు:- క్రెడిట్ కార్డ్ ద్వారా ఈఎంఐతో కొనుగోళ్లు చేస్తుంటే, ఇక నుంచి అదనపు ఛార్జీలు పడతాయి. అందుకే ఏదైన ప్రాడక్ట్ కొనుగోలు చేసే ముందు పూర్తి సమాచారం తెలుసుకోవాల్సి ఉంటుంది.
బిల్ పేమెంట్ ఛార్జీలు:- కొన్ని పేమెంట్ మోడ్స్‌పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని ఎస్బీఐ వెల్లడించింది. వీటిని గతంలో చూడలేదు. ఆన్లైన్ బిల్ పేమెంట్స్, ఆటో డెబిట్ ట్రాన్సాక్షన్ వంటిపై ఛార్జీలు పడొచ్చు.
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్..
ఫ్యూయెల్ సర్ఛార్జ్ వేవర్:- పలు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై ఫ్యూయెల్ సర్ఛార్జ్ మాఫీ రూల్స్‌ని మార్చడం జరిగింది. కొన్ని కార్డుల్లో దీన్ని పూర్తిగా తొలగించడం జరిగింది. ఇంకొన్నిట్లో లిమిట్‌ని మార్చడం జరిగింది. వీటిని కచ్చితంగా చెక్ చేయాలి.
రివార్డ్ పాయింట్స్:- క్రెడిట్ కార్డ్ ద్వారా లభించిన రివార్డ్ పాయింట్స్ రిడీమ్ చేసుకునే ప్రాసెస్‌ని ఐసీఐసీఐ బ్యాంక్ మార్చింది. గతంతో పోలిస్తే, ఇప్పుడు పలు లిమిటేషన్స్‌తో వీటిని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వడ్డీ రేట్ల మార్పు:- ఈఎంఐల ద్వారా చేసే లావాదేవీలపై వడ్డీ రేట్లను ఐసీఐసీఐ బ్యాంక్ మార్చింది. కార్డు టైప్, ట్రాన్సాక్షన్తో పాటు ఇతర అంశాల ఆధారంగా వడ్డీ రేట్లు మారుతాయని గ్రహించాలి.
ఉచితంగా 50 లీటర్ల పెట్రోల్..!
కస్టమర్స్‌ని ఆకట్టుకునేందుకు, వారి క్రెడిట్ కార్డు స్పెండింగ్ని పెంచేందుకు బ్యాంకులు కృషి చేస్తుంటారు. ఇందులో భాగంగానే వివిధ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తమ క్రెడిట్ కార్డులతో కస్టమర్స్‌కి మంచి బెనిఫిట్స్ ఇస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో ఒకటి.. ఈ ఇండియన్ ఆయిల్ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు. దీని ద్వారా వార్షికంగా 50 లీటర్ల వరకు పెట్రోల్ లేదా డీజిల్‌ని ఫ్రీగా పొందొచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం