MS Dhoni : కొత్త ఈ-సైకిల్​ కొన్న ధోనీ.. ధర ఎంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!-ms dhoni gets the emotorad doodle v3 e cycle check out its price ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ms Dhoni : కొత్త ఈ-సైకిల్​ కొన్న ధోనీ.. ధర ఎంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

MS Dhoni : కొత్త ఈ-సైకిల్​ కొన్న ధోనీ.. ధర ఎంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

Sharath Chitturi HT Telugu
Mar 30, 2024 08:10 AM IST

MS Dhoni new electric cycle : మహేంద్ర సింగ్​ ధోనీ.. కొత్త ఈ-సైకిల్​ కొన్నాడు. దాని ధర ఎంతో తెలిస్తే షాక్​ అవ్వాల్సిదే!

ధోనీ కొన్న కొత్త ఈ-సైకిల్​ ఇదే..
ధోనీ కొన్న కొత్త ఈ-సైకిల్​ ఇదే..

EMotorad Doodle V3 e-cycle : టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి బైక్స్​పై ఉన్న ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గ్యారేజ్​లో చాలా బైక్స్​ ఉన్నాయి. ఇక ఇప్పుడు.. ఈ క్రికెటర్ ఓ కొత్త ఈ-సైకిల్​ కొన్నాడు. దాని పేరు ఈ-మోటోరాడ్ డూడుల్ వీ 3 ఈ-సైకిల్.

yearly horoscope entry point

హెల్మెట్ ధరించిన ధోనీ.. ఎలక్ట్రిక్ సైకిల్ తొక్కుతూ కనిపించాడు. డూడుల్ వీ3 ఒక ఫోల్డెబుల్ ఈ-సైకిల్. ఎక్కడికైనా ఇది తీసుకెళ్లడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది.

ధోనీ కొన్న కొత్త ఈ-సైకిల్​ ఇదే..
ధోనీ కొన్న కొత్త ఈ-సైకిల్​ ఇదే..

ధర రూ. 53వేలు..!

MS Dhoni EMotorad Doodle V3 e-cycle : ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ ఉపయోగించి ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ ఈఎం డూడుల్​ వీ3లో 12.75 ఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం దీని ధర రూ.52,999 ధరకు లభ్యమవుతోంది. 16 ఇంచ్​ అల్యూమినియం అలాయ్ ఫ్రేమ్, 20 ఇంచ్​ స్పోక్డ్ వీల్స్, ఫ్యాట్ టైర్లు ఇందులో ఉన్నాయి. ఫ్రెంట్ ఫోర్కులు లాకౌట్​తో 60 ఎంఎం ట్రావెల్​ కలిగి ఉంటాయి. డూడుల్ వీ3 ఆటో కట్​తో పవర్ ఆపడానికి డిస్క్ బ్రేక్​లను పొందుతుంది. అయితే వెనుక చక్రానికి పవర్​ని పంపడానికి షిమానో టూర్నీ 7-స్పీడ్ గేర్ బాక్స్​ను ఉపయోగిస్తుంది ఈ ఈ-సైకిల్​.

కార్లు, బైక్ల దగ్గరే ధోనీ ప్రేమ ఆగిపోదు. అతను గతంలో ట్రాక్టర్ నడుపుతూ కూడా కనిపించాడు.

MS Dhoni IPL 2024 : ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) తాజా సీజన్​లో సీఎస్​కేతో కలిసి ఆడుతున్నాడు ధోనీ. సీజన్ చివర్లో రిటైర్మెంట్ ప్రకటిస్తే ఐపీఎల్లో ధోనీకి ఇదే చివరి ఏడాది కావచ్చు. అభిమానులు తలా అని ముద్దుగా పిలుచుకునే ధోనీ ఇటీవల ఐపీఎల్ 2024 కోసం సీఎస్​కే కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్​కు అప్పగించాడు. అయితే.. ధోనీ ఇప్పటివరకు బ్యాటింగ్​కి రాలేదు. నెంబర్​ 7 వరకు అతను కనిపించకపోవడంతో.. అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఫీల్డింగ్​లో ధోనీని చూసి సరిపెట్టుకుంటున్నారు. ధోనీ బ్యాటింగ్​కి రావాలని కోరుకుంటున్నారు. మరి.. నెంబర్​ 7 వరకు కూడా బ్యాటింగ్​కి దిగొద్దని ధోనీ ఎందుకు అనుకుంటున్నాడో!

Whats_app_banner

సంబంధిత కథనం