MG Cyberster EV : ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ- అదిరిందిగా.. రేంజ్ ఎంతంటే!
MG Cyberster EV revealed : ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ త్వరలోనే లాంచ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఈవీ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
MG Cyberster EV revealed : 'సైబర్‌స్టర్' ఈవీని యూకేలో ప్రదర్శించింది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్. త్వరలోనే ఇది యూకేలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఇండియాలో లాంచ్ చేసే ప్లాన్స్ ప్రస్తుతం ఎంజీ మోటార్‌కు లేవని సమాచారం. ఈ ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాము..
ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ..
MG Cyberster EV sportscars : ఈ ఈవీకి సంబంధించిన కాన్సెప్ట్‌ను 2020లోనే రివీల్ చేసింది ఎంజీ మోటార్. దీనికి ఓ స్పోర్ట్స్ కారు లుక్ ఉంటుంది. ఇటీవలే ముగిసిన షాంఘై ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్‌ను ప్రదర్శించింది. ఈ ఈవీ చాలా అట్రాక్టివ్ లుక్స్‌తో వస్తున్నట్టు స్పష్టమైపోయింది. పెద్ద బానెట్, సిసర్ డోర్స్, అగ్రెసివ్ బంపర్స్, క్లీన్ సైడ్ ప్రొఫైల్‌లు ఉండనున్నాయి. యారో షేప్‌లోని ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, వెహికిల్ విడ్త్ మొత్తం స్ట్రెచ్ అయ్యే విధంగా ఉన్నా లైట్బార్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇందులోని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ డిజైన్.. పోర్షే నుంచి స్ఫూర్తి పొంది రూపొందించినట్టు కనిపిస్తోంది.
ఇదీ చూడండి:- BMW X3 M40i launched : బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎం40ఐ లాంచ్.. ధర ఎంతంటే!
డైమెన్షన్స్ విషయానికొస్తే.. ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ పొడవు 4,535ఎంఎం. వెడల్పు 1,913ఎంఎం. ఎత్తు 1,329ఎంఎం. వీల్‌బేస్ 2,690ఎంఎం. కర్బ్ వెయిట్ 1,850 కేజీలు లేదా 1,985 కేజీలు ఉండొచ్చు. ఇందులో డ్యూయెల్ మోటార్, సింగిల్ మోటార్ వర్షెన్లు ఉండనున్నాయి.
ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ- ధర..
MG Cyberster EV price : ఈ ఎంజీ సైబర్‌స్టర్ ఈవీ టాప్ స్పీడ్ 200 కేఎంపీహెచ్ అని తెలుస్తోంది. ఇందులోని యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 201 హెచ్‌పీ పవర్‌ను, రేర్- యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 335 హెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తాయి. బ్యాటరీ ప్యాక్ వివరాలు ఇంకా తెలియలేదు. కాగా.. ఇందులో 64 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 800కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.
MG Cyberster EV launch : యూకేలో ఈ మోడల్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర 50,000 పౌండ్లుగా ఉండొచ్చు. అంటే సుమారు రూ. 51.19లక్షలు!
సంబంధిత కథనం