Maruti Suzuki chip shortage : చిప్​ కొరతతో మారుతీకి చింత! ఇంకొన్ని నెలలు తప్పదు!-maruti suzuki says chip shortage is real problem could continue for few more quarters ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Chip Shortage : చిప్​ కొరతతో మారుతీకి చింత! ఇంకొన్ని నెలలు తప్పదు!

Maruti Suzuki chip shortage : చిప్​ కొరతతో మారుతీకి చింత! ఇంకొన్ని నెలలు తప్పదు!

Sharath Chitturi HT Telugu
Mar 05, 2023 10:20 PM IST

Maruti Suzuki chip shortage news : సెమీకండక్టర్​ల కొరత.. మారుతీ సుజుకీపై భారీగానే పడింది. మరి కొన్ని నెలల పాటు ఈ సమస్య వెంటాడుతుందని సంస్థ చెప్పింది. ఫలితంగా పలు డిమాండ్​ ఉన్న మోడల్స్​ వెయిటింగ్​ పీరియడ్​ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

చిప్​ కొరతతో మారుతీకి చింత!
చిప్​ కొరతతో మారుతీకి చింత! (PTI)

Maruti Suzuki chip shortage : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీని సెమీకండక్టర్​ చిప్స్​ కొరత వెంటాడుతోంది. మరికొన్ని త్రైమాసికాల పాటు చిప్​ల కొరత ఉంటుందని సంస్థ పేర్కొంది. ఫలితంగా పలు మోడల్స్​కు సంబంధించిన వెయిటింగ్​ పీరియడ్​ ఇంకా పెరుగుతుందని స్పష్టం చేసింది.

వెయిటింగ్​.. వెయిటింగ్​.. వెయిటింగ్​..

ప్రస్తుతం.. మారుతీ సుజుకీ పెండింగ్​ ఆర్డర్ల సంఖ్య 3.69లక్షలుగా ఉంది. బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​ ఎర్టిగాకు అత్యధిక ఆర్డర్లు (94వేలు) పెండింగ్​​లో ఉన్నాయి. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, బ్రెజా ఎస్​యూవీలకు వరుసగా 37వేలు, 61,500 యూనిట్​లు పెండింగ్​లో ఉన్నాయి. కొత్తగా లాంచ్​ అయిన మారుతీ సుజుకీ జిమ్నీ, ఫ్రాంక్స్​లకు ఇప్పటివరకు 22,000- 12,000 ఆర్డర్లు వచ్చాయి. వీటి ప్రొడక్షన్​ ఇంకా మొదలవ్వలేదు.

Maruti Ertiga waiting period : చిప్​ల కొరత కారణంగా గతేడాది అక్టోబర్​- డిసెంబర్​ త్రైమాసికంలో.. అంచనాల కన్నా 46వేల యూనిట్​లను తక్కువగా తయారు చేసింది మారుతీ సుజుకీ. అప్పటికే పెండింగ్​ ఆర్డర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇక ఇప్పుడు కూడా సెమీకండక్టర్​ల కొరత కొనసాగుతుందని సంస్థ చెబుతుండటం గమనార్హం.

"సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుంది. సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయి అని ఇప్పుడే చెప్పడం కష్టం. మాకైతే.. సాధారణ పరిస్థితులు సమీప భవిష్యత్తు దూరంలో కూడా కనిపించడం లేదు," అని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్​, సేల్స్​- సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ ఆఫీసర్​ శ్రీనివాస్​ శ్రీవాస్తవ తెలిపారు.

ప్యాసింజర్​ వాహనాలు.. రయ్​రయ్​..!

Maruti Suzuki pending orders : ప్యాసింజర్​ వెహికిల్​ సెగ్మెంట్​పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు శ్రీవాస్తవ. ఇండియా పీవీ సెగ్మెంట్​లో ఎస్​యూవీలకు 42.6శాతం వాటా ఉందని, హ్యాచ్​బ్యాక్​ మోడల్స్​ మార్కెట్​ షేరు 35శాతంగా ఉందని వివరించారు. ఈ ఆర్థిక ఏడాదిలో పీవీ సెగ్మెంట్​లో 35.5లక్షల యూనిట్​లు అమ్ముడుపోయాయని, ఈ నెల చివరి నాటికి అది 38.8లక్షల యూనిట్​లు దాటుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే జరిగితే.. దేశ చరిత్రలోనే ఇదొక రికార్డ్​ అవుతుందని పేర్కొన్నారు.

Chip Shortage Indian Auto industry : 2022-23 ఆర్థిక ఏడాదితో పోల్చుకుంటే.. రానున్న ఫైనాన్షియల్​ ఇయర్​లో పీవీ సెగ్మెంట్​ 5-7శాతం వృద్ధిచెందుతుందని శ్రీవాస్తవ తెలిపారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో 40.5లక్షలు -41లక్షల యూనిట్​లు అమ్ముడుపోతాయని అంచనావేస్తున్నట్టు వివరించారు. ఇండస్ట్రీ కన్నా మారుతీ సుజుకీ ప్రదర్శన మెరుగ్గా ఉంటుందని అశాభావం వ్యక్తం చేశారు.

Whats_app_banner