Mahindra XUV300 EV : మహీంద్రా ఎక్స్​యూవీ300కి 'ఈవీ' టచ్​.. త్వరలోనే లాంచ్​!-mahindra xuv300 ev in work for indian market check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mahindra Xuv300 Ev : మహీంద్రా ఎక్స్​యూవీ300కి 'ఈవీ' టచ్​.. త్వరలోనే లాంచ్​!

Mahindra XUV300 EV : మహీంద్రా ఎక్స్​యూవీ300కి 'ఈవీ' టచ్​.. త్వరలోనే లాంచ్​!

Sharath Chitturi HT Telugu
Dec 11, 2023 12:46 PM IST

Mahindra XUV300 EV : మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీని సంస్థ సిద్ధం చేస్తోందని టాక్​! మరికొన్నినెలల్లో ఇది లాంచ్​ అవుతుందని సమాచారం.

మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఈవీ టచ్​.. త్వరలోనే లాంచ్​!
మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఈవీ టచ్​.. త్వరలోనే లాంచ్​!

Mahindra XUV300 EV launch date in India : ఇండియాన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వెహికిల్​ సెగ్మెంట్​పై ఫోకస్​ పెంచింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఇప్పటికే పలు మోడల్స్​ని లైనప్​లో పెట్టింది. ఇక ఇప్పుడు.. మరో ఈవీపై సంస్థ పని చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న మహీంద్రా ఎక్స్​యూవీ300కి ఈవీ టచ్​ ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకుందట! అంతేకాకుండా.. ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​ని 2024 జూన్​లోపే లాంచ్​ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఈవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీ..

మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీ డిజైన్​.. ప్రస్తుతం ఉన్న ఐసీఈ ఇంజిన్​ మోడల్​తోనే పోలి ఉండే అవకాశం ఉంది. డ్రాప్​-డౌన్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​ ఉండొచ్చు. బంపర్​, హెడ్​ల్యాంప్​, గ్రిల్​ వంటివి మారే అవకాశం ఉంది. రేర్​లో టెయిల్​గేట్​ సరికొత్తగా ఉండనుంది. ఇక రిజిస్ట్రేషన్​ ప్లేట్​ని పెట్టే ప్లేస్​ని కూడా మార్చే అవకాశం లేకపోలేదు.

Mahindra XUV300 EV price in India : ఇక ఈ మహీంద్రా కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ కేబిన్​లో పెద్దగా మార్పులు కనిపించకపోవచ్చు. భారీ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, ఏసీ వెంట్స్​, స్విచ్​గేర్​, సెంటర్​ కన్సోల్​లు ఇందులో సాధారణంగానే ఉండనున్నాయి.

మహీంద్రా అండ్​ మహీంద్రాకు ప్రస్తుతం ఒక్కటే ఈవీ మార్కెట్​లో అందుబాటులో ఉంది. అది.. మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ. ఇందులో 40కేడబ్ల్యూహెచ్​ బ్యారీ ఉంటుంది. కాగా.. మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీలో 35 కేడబ్ల్యూ బ్యాటరీ ఉంటుదని టాక్​ నడుస్తోంది. దీని రేంజ్​కు సంబంధించిన వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.

కొత్త ఎలక్ట్రిక్​ వెహికిల్​ ధర ఎంత ఉంటుంది?

Mahindra XUV300 EV range : ఇండియాలో.. మహీంద్రా ఎక్స్​యూవీ300 ఈవీ ధరకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. కాగా.. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 15లక్షలు- రూ. 18లక్షల మధ్యలో ఉండొచ్చు. మహీంద్రా ఎక్స్​యూవీ400 ఈవీ ఎక్స్​షోరూం ధర దీని కన్నా రూ. 2లక్షలు ఎక్కువగా ఉంటుంది.

మరోవైపు.. ఎక్స్​యూవీ300 ఐసీఈ మోడల్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ కూడా రాబోతోంది. 2024 ఫిబ్రవరిలో దీనిని సంస్థ లాంచ్​ చేస్తుందని సమాచారం.

Mahindra XUV300 EV full specifications : అయితే.. ఈ ఈవీ, ఐసీఈ ఇంజిన్​ల ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఏదైనా అప్డేట్​ వచ్చే అవకాశం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం