liquor prices hike in Maharashtra : హోటల్స్, బార్స్‌లో విక్రయించే మద్యంపై వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) పెంచాలని తాజాగా నిర్ణయించింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఈ నిర్ణయం.. ఈ నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది ప్రభుత్వం.
"రెస్టారెంట్లు, బార్లలో లిక్కర్ సేవలపై 5శాతంగా ఉన్న వ్యాట్‌ను 10శాతానికి పెంచుతున్నాము," అని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే.. ఒకేసారి మద్యం ధరలు దాదాపు 5శాతం పెరుగుతాయని అర్థం!
అయితే.. ఇలా కస్టమర్లపై ట్యాక్స్ భారం వేయటం ప్రభుత్వానికే చేటు చేస్తుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రమాదంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
Vat increase on liquor : "ఇలా మద్యం ధరలు పెంచుకుంటూ పోతే.. కస్టమర్లు బ్లాక్‌లో లేదా పర్మీషన్ లేని చోట్ల కొనుక్కునేందుకు ప్రయత్నిస్తారు. హోటల్స్, బార్లలో మద్యం సేవలపై వ్యాట్‌ను పెంచేస్తే.. ప్రజలు పార్కుల్లో, ఇళ్ల మీద, బీచ్‌లలో, పార్కింగ్ లాట్లలో కూర్చుని మద్యాన్ని సేవిస్తారు. అది మంచిది కాదు," అని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
ఇలా వ్యాట్ పెంచడమే కాకుండా.. ఆల్కోహల్ పరిశ్రమకు తలనొప్పిని తీసుకొచ్చే విధంగా.. మరిన్న చర్యలు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. బీవరేజెస్లో ఆల్కోహల్ కంటెంట్ బట్టి, దాని ధర ఉండే విధంగా ఒక విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం చూస్తోందట. అంతేకాకుండా.. బార్లు, పర్మిట్ రూమ్‌లలో విక్రయంచే లిక్కర్ బాటిల్స్‌పై పర్మిట్స్‌ని మరింత కఠినంతరం చేయాలని కూడా చూస్తొందని సమాచారం. అయితే ఈ రెండు కూడా ప్రస్తుతం రూమర్స్ స్టేజ్‌లోనే ఉన్నాయి. ప్రభుత్వం వీటిని అమలు చేస్తుందా? ఎప్పుడు అమలు చేస్తుంది? వంటి వివరాలు తెలియవు. ఒక వేళ ఇవి అమల్లోకి వస్తే.. బీర్ ధరలు తగ్గుతాయి. కానీ మొత్తం మీద రెవెన్యూ పెరుగుతుంది.
Maharashtra liquor prices : మహారాష్ట్రలో లిక్కర్‌పై వచ్చే జీఎస్టీ రాబడి చాలా అధికంగా ఉంటుంది. ఇక ముంబైలోని 3 స్టార్ కన్నా తక్కువ రేటింగ్ ఉన్న హోటల్స్‌లో మద్యం సేవలపై మరింత ట్యాక్స్ పెంచాలని అక్కడి యంత్రాంగం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం 5శాతంగా ఉన్న ట్యాక్స్.. 10-15శాతం వరకు చేరొచ్చని తెలుస్తోంది. ఇదే జరిగితే.. ప్రభుత్వానికి వార్షికంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 600కోట్ల వరకు అదనంగా రెవెన్యూ జనరేట్ అవుతుంది.
సంబంధిత కథనం