Mlc Kavitha : దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట, నవంబర్ 20 వరకు నో విచారణ!-delhi liquor case supreme court postponed hearing on mlc kavitha petition to november 20th ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Delhi Liquor Case Supreme Court Postponed Hearing On Mlc Kavitha Petition To November 20th

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట, నవంబర్ 20 వరకు నో విచారణ!

Bandaru Satyaprasad HT Telugu
Sep 26, 2023 02:58 PM IST

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. కవతి దాఖలు చేసిన పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్ 20కు వాయిదా వేసింది కోర్టు. దీంతో అప్పటి వరకూ కవితను విచారణకు పిలవమని ఈడీ కోర్టుకు తెలిపింది.

ఎమ్మెల్సీ కవిత
ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. దిల్లీ లిక్కర్ కేసులో కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు... తదుపరి విచారణను నవంబర్‌ 20కు వాయిదా వేసింది. అక్టోబర్‌ 18న పీఎంఎల్‌ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ తెలిపారు. ఈ విచారణ అనంతరం కవిత పిటిషన్ పై విచారణ చేపడతామన్నారు. అయితే అప్పటివరకు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో నవంబర్ 20 వరకు ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలవబోమని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఏ స్థాయిలో ఉన్నారనేది పక్కనబెడితే అసలు విచారణకు పిలవద్దంటే ఎలా? అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ అన్నారు. అయితే మహిళల విచారణలో తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నవంబర్‌ 20కు వాయిదా వేసినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

ఈడీ నోటీసులు రద్దు చేయాలని కవిత పిటిషన్

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో విచారణకు రావాలంటూ ఈడీ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. నళిని చిదంబరం కేసులో మాదిరి ఉపశమనం కోరుతున్నానన్నారు. మహిళల విచారణకు సంబంధించిన మార్గదర‌్శకాలపై కూడా కవిత స్పష్టత చేయాలని కోర్టును కోరారు. సెప్టెంబర్ 15న జరిగిన విచారణలో కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయడానికి పది రోజులు గడువు కావాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. దీంతో విచారణకు హాజరు కావాలని కవితకు ఇచ్చిన నోటీసులను కూడా పది రోజులు వాయిదా వేశారు. గడువు పూర్తి కావడంతో జడ్జి సంజయ్ కిషన్‌ కౌల్ ధర్మాసనం ఇవాళ పిటిషన్ పై విచారణ జరిపింది.

ఈడీ నోటీసులు

సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఈడీ విచారణను సవాలు చేస్తూ గతంలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే ఈడీ మరోసారి నోటీసులు జారీ చేయడంపై సమాధానం చెప్పాలని ధర్మాసనం ఆదేశించింది. గతంలో దిల్లీ లిక్కర్‌ స్కామ్‌పై విచారణ సందర్భంగా ఈడీ మొదటిసారి నోటీసులు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళల్ని ఇంటిలో విచారించాలని, నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసుల్లో దాఖలైన పిటిషన్లను కవిత ఉటంకించారు. తనకు కూడా విచారణ నుంచి ఉపశమనం కల్పించాలని కోరారు.

తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.