Kinetic Green Zulu electric scooter : మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్- ధర ఎంతంటే!
Kinetic Green Zulu electric scooter : కైనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లాంచ్ అయ్యింది. ఫీచర్స్, ధర, రేంజ్ వివరాలివే..
Kinetic Green Zulu electric scooter : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్ అయ్యింది. దీని పేరు కైనెటిక్ గ్రీన్ జులు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము.
కైనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్..
ఇండియాలో కైనెటిక్ బ్రాండ్ చాలా ఫేమస్. హోండాతో కలిసి.. కైనెటిక్ హోండ్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అప్పట్లో ఈ మోడల్‌కి మంచి క్రేజ్ ఉండేది.
ఇక ఇప్పుడు.. జులు పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని భారతీయుల ముందుకు తీసుకొచ్చింది సంస్థ. ఇందులో ఏప్రన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్,హ్యాండిల్‌బార్ స్టాక్‌పై డీఆర్ఎల్ వంటివి ఉంటాయి. అటు స్పోర్టీ లుక్‌తో పాటు ఫ్యామిలీ కస్టమర్లను ఆకర్షించే విధంగా ఉంది ఈ ఈ-స్కూటర్.
Kinetic Green Zulu e scooter : కైనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ పొడవు 1,830ఎంఎం. వెడల్పు 715ఎంఎం. ఎత్తు 1,135ఎంఎం. వీల్‌బేస్ 1,360ఎంఎం. గ్రౌండ్ క్లియరెన్స్ 160ఎంఎం. ఈ మోడల్ కర్బ్ వెయిట్ 93కేజీలు. 150కేజీల వరకు బరువును మోయగలదు.
ఈ ఈ-స్కూటర్లో 2.27 కేడబ్ల్యూహెచ్ లిథియం- ఐయాన్ బ్యాటరీ ఉంటుంది. హబ్ మోటార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఇది ఫిక్స్ అయ్యి ఉంటుంది. 0-80శాతం ఛార్జింగ్.. కేవలం 30 నిమిషాల్లోనే పూర్తవుతుందని సంస్థ చెబుతోంది. ఇక ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 104 కి.మీల దూరం ప్రయాణిస్తుందని స్పష్టం చేసింది. ఈ మోడల్ టాప్ స్పీడ్ 60 కేఎంపీహెచ్.
Kinetic Green Zulu electric scooter price : ఈ వెహికిల్ ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, రేర్‌లో డ్యూయెల్ షాక్ అబ్సార్బర్స్ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్- రేర్‌లో డిస్క్ బ్రేక్స్ లభిస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి.. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌లోనే ఆయిల్ కూల్డ్ బ్యాటరీ ఆప్షన్ని తీసుకురావాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. ఫలితంగా.. రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ధర ఎంతంటే..
ఈ మోడల్ని పూర్తిగా ఇండియాలోనే మేన్యుఫ్యాక్చర్ అవుతుంది. ఈ కైనెటిక్ గ్రీన్ జులు ఎక్స్‌షోరూం ధర రూ. 95,000. వచ్చే 12 నెలల్లో కనీసం 40వేల యూనిట్లను అమ్మాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. అంతేకాకుండా.. జులు తర్వాత.. లూనాకు ఎలక్ట్రిక్ వర్షెన్‌ని కూడా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచించింది.
Kinetic Green Zulu price : ఇక ఈ కైనెటిక్ గ్రీన్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్.. ఓలా ఎస్1 ఎక్స్+, ఒకినవా ప్రైజ్ప్రోతో పాటు పలు ఇతర మోడల్స్‌తో పోటీపడనుంది.
సంబంధిత కథనం