Kinetic E Luna moped : త్వరలోనే కైనెటిక్​ ఈ- లూనా లాంచ్​..!-all new kinetic electric luna moped launch confirmed see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Kinetic E Luna Moped : త్వరలోనే కైనెటిక్​ ఈ- లూనా లాంచ్​..!

Kinetic E Luna moped : త్వరలోనే కైనెటిక్​ ఈ- లూనా లాంచ్​..!

Sharath Chitturi HT Telugu

Kinetic electric Luna moped : కైనెటిక్​ లూనా మోపెడ్​ ఎలక్ట్రిక్​ వర్షెన్​ వచ్చేస్తోంది! ఈ విషయాన్ని కైనెటిక్​ గ్రీన్​ ఫౌండర్​, సీఈఓ సులజ్జ ఫిరోదియా మోత్వాని ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

త్వరలోనే కైనెటిక్​ ఈ లూనా లాంచ్​..! (Sulajja Firodia Motwani/ Twitter)

Kinetic electric Luna moped launch : దేశ మొబిలిటీ సెగ్మెంట్​లో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన కైనెటిక్​ లూనా గుర్తుందా? ఈ టూ వీలర్​ మోపెడ్​.. ఇప్పుడు మళ్లీ ఇండియన్​ రోడ్లపై చక్కర్లు కొట్టడానికి సిద్ధమవుతోంది! 'ఈ లూనా'ను దేశంలో లాంచ్​ చేస్తున్నట్టు ప్రకటించారు కైనెటిక్​ గ్రీన్​ ఫౌండర్​, సీఈఓ సులజ్జ ఫిరోదియా మోత్వాని.

ఎంట్రీ లెవల్​ మోపెడ్​గా..

కైనెటిక్​ గ్రూప్​ ఫౌండర్​, తన తండ్రి అరుణ్​ ఫిరోదియా.. కైనెటిక్​ లూనాపై కూర్చుని ఉన్న ఫొటోను షేర్​ చేశారు మోత్వాని. "ఎ బ్లాస్ట్​ ఫ్రమ్​ ది పాస్ట్​! చెల్​ మేరీ లూనా (పద లునా)తో మా తండ్రి పద్మశ్రీ అరుణ్​ ఫిరోదియా. రానున్న రోజుల్లో కైనెటిక్​ గ్రీన్​ నుంచి ఈ- లూనా రాబోతోంది. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను," అని మోత్వాని అన్నారు.

ఈ కైనెటిక్​ ఈ లూనాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే.. ఇదొక ఎంట్రీ లెవెల్​ మోపెడ్​గా ఉంటుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి. అలనాటి లూనా కూడా ఎంట్రీ లెవెల్​ మోపెడ్​గా అడుగుపెట్టి సంచలనాలు సృష్టించింది. పూణెలోని కైనెటిక్​ గ్రీన్​ ఫ్యాక్టరీలో దీనిని తయారు చేసే అవకాశం ఉంది. కాగా రెండో ప్లాంట్​ను పూణెకు సమీపంలో ఇటీవలే ప్రారంభించింది ఈ సంస్థ. ఏడాదికి 10లక్షల ఎలక్ట్రిక్​ టూ వీలర్లతో పాటు త్రీ వీలర్​ వాహనాలను తయారు చేసే సామర్థ్యం ఈ ప్లాంట్​కు ఉందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- Mahindra Bolero Neo Plus : మహీంద్రా బొలేరో నియో ప్లస్​.. త్వరలోనే లాంచ్​!

కైనెటిక్​ ఈ లూనా లాంచ్​ అయితే.. అనేక బీ2బీ ఎలక్ట్రిక్​ టూ వీలర్లకు గట్టి పోటీ తప్పదని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. రైడర్​ వెనకాల ప్యాసింజర్​ కాకుండా.. లోడ్​ క్యారీయింగ్​కు అవకాశం ఉండే విధంగా ఈ లూనాను డిజైన్​ చేసే యోచనలో సంస్థ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఈ లూనా ఎలక్ట్రిక్​ మోటార్​, బ్యాటరీ, రేంజ్​ వంటి వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. రానున్న వారాల్లో ఒక క్లారిటీ వస్తుంది.

Kinetic E Luna price : అప్పట్లో లూనా చాలా ఫేమస్​. దానిని క్యాష్​ చేసుకోవాలని కైనెటిక్​ గ్రీన్​ చూస్తోంది. లూనా పేరు చెబితే.. ఆకర్షితులయ్యే కస్టమర్లు ఉంటారని భావిస్తోంది. అయితే.. 2 వీలర్​ ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​లో పోటీ విపరీతంగా ఉంది. ప్రజలకు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. ఈ పరిస్థితుల మధ్య.. రేంజ్​, పర్ఫార్మెన్స్​ బాగుంటేనే ఈ లూనా క్లిక్​ అవుతుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనం