Kia EV9 launch: 5 సెకన్లలో 100 కిమీల వేగం; 561 కిమీల రేంజ్; కియా ఈవీ 9 లాంచ్
Kia EV9 launch: కియా ఇండియా తన రెండవ ఎలక్ట్రిక్ వాహనమైన ఈవీ 9 ను అక్టోబర్ 3, గురువారం లాంచ్ చేసింది. కియా ఈవీ 9 ధర రూ .1.29 కోట్లు. ఈ ఫ్లాగ్ షిప్ మోడల్ 378 బీహెచ్ పీ శక్తిని కలిగి ఉంది. 5.3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 561 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
Kia EV9 launch: కియా ఇండియా తన రెండవ ఎలక్ట్రిక్ వాహనమైన ఈవీ9 ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కియా ఎలక్ట్రిక్ కు ఇది ఇప్పుడు ఫ్లాగ్ షిప్ వాహనంగా మారింది. దీని ధర రూ .1.29 కోట్లుగా నిర్ణయించారు. కియా ఈవీ9 ప్రస్తుతం జీటీ లైన్ అనే ఒకే ఒక్క వేరియంట్ లో లభిస్తుంది.
కియా ఈవీ9 స్పెసిఫికేషన్లు ఏమిటి?
కియా ఈవీ9 లోని ఎలక్ట్రిక్ మోటార్ 378 బీహెచ్ పీ పవర్, 700ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేయగలదు. ఇది కేవలం 5.3 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. డ్రైవ్ మోడ్స్, టెర్రైన్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
కియా ఈవీ9 రేంజ్ ఎంత?
99.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ద్వారా ఈవీ9 ఒక్కసారి ఛార్జ్ చేస్తే 561 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కియా ఇండియా పేర్కొంది. ఇది 350 కిలోవాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 24 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు టాప్ అప్ చేయగలదు.
కియా ఈవీ9 ఏ ప్లాట్ ఫామ్ ను ఉపయోగిస్తుంది?
కియా ఈవీ9 కియా, హ్యుందాయ్ మధ్య భాగస్వామ్యంతో రూపొందిన ఇ-జిఎంపి ప్లాట్ ఫామ్ పై ఆధారపడి ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డ్ ప్లాట్ ఫాం కాబట్టి చక్రాలు కార్నర్స్ లో ఉంటాయి. దీనివల్ల ప్రయాణీకులకు క్యాబిన్ స్థలం పెరుగుతుంది. కియా ఈవీ9కు 198 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.
కియా ఈవీ9 భద్రతా ఫీచర్లు ఏంటి?
భద్రత పరంగా కియా ఈవీ9లో మల్టీ కొలిషన్ బ్రేకులు, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్, టీపీఎంఎస్, 10 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 27 అటానమస్ ఏడీఏఎస్ ఫీచర్లతో కూడిన సమగ్ర సూట్ కూడా ఇందులో ఉంది.
కియా ఈవీ9 ఇతర ఫీచర్లు
కియా ఈవీ 9 (Kia EV9) లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్, లెథరెట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, స్మార్ట్ పవర్ టెయిల్ గేట్, షిఫ్ట్ బై వైర్, ఆటో హోల్డ్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ముందు సీట్లకు ఎలక్ట్రిక్ సర్దుబాటు, మసాజ్ ఫంక్షన్లతో పాటు రెండో వరుసకు వింగ్ స్టైల్ హెడ్ రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్ తో హీటెడ్, వెంటిలేటెడ్ సీట్లు ఉన్నాయి. అంతేకాకుండా, కియా (KIA MOTORS) యుఎస్బి టైప్ సి పోర్ట్ లు, 3-జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్స్-అప్ డిస్ప్లే, కూల్డ్ వైర్లెస్ ఛార్జర్ తదితర ఫీచర్స్ ను కూడా అందిస్తుంది.