Kawasaki Ninja ZX-4RR: భారత్ లో కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ లాంచ్; ధర రూ.9.10 లక్షలు
Kawasaki Ninja ZX-4RR: కొత్త నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ను భారతీయ మార్కెట్లో శుక్రవారం కవాసాకి లాంచ్ చేసింది. ఇది కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా పరిమిత సంఖ్యలో భారతదేశానికి దిగుమతి చేస్తారు. దీని ఎక్స్ షో రూమ్ ధరను రూ. 9.10 లక్షలుగా నిర్ణయించారు.
Kawasaki Ninja ZX-4RR: ఇండియా కవాసాకి మోటార్ (ఐకెఎం) కొత్త నింజా జెడ్ఎక్స్ -4 ఆర్ఆర్ ను భారతదేశంలో రూ .9.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. కొత్త కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ లో 4 సిలిండర్ ఇంజన్ ఉంటుంది. కొత్త నింజా జెడ్ఎక్స్ -4ఆర్ఆర్ (Kawasaki Ninja ZX-4RR) ను నింజా జెడ్ఎక్స్ -4ఆర్ ప్లాట్ ఫామ్ పైనే నిర్మించారు. దీనిని భారత్ కు కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (CBU) గా పరిమిత సంఖ్యలో తీసుకువస్తున్నారు.
కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ స్పెసిఫికేషన్లు
కొత్త కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న బైక్ లలో ఒకటి. ఇందులో 399 సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 14,500 ఆర్పీఎమ్ వద్ద 76 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎమ్ వద్ద 37.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హై-రివ్వింగ్ ఇంజిన్ 15,000 ఆర్ పిఎమ్ వరకు పనిచేస్తుంది. ఇందులో ఇంజన్ తో కనెక్ట్ అయి 6-స్పీడ్ గేర్ బాక్స్ , బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఉంటాయి. ఈ బైక్ కెర్బ్ బరువు కేవలం 189 కిలోలు మాత్రమే కావడం విశేషం.
సస్పెన్షన్స్ అండ్ బ్రేక్స్
హార్డ్ వేర్ కాంపోనెంట్స్ లో.. ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో 37 ఎంఎం యూఎస్ డీ షోవా ఎస్ ఎఫ్ ఎఫ్-బీపీ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబుల్ షోవా బీఎఫ్ ఆర్ సీ లైట్ మోనోషాక్ ఉన్నాయి. బ్రేకింగ్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందు భాగంలో 290 ఎంఎం డ్యూయల్ సెమీ ఫ్లోటింగ్ డిస్క్, వెనుక భాగంలో సింగిల్ 220 ఎంఎం డిస్క్ బ్రేకులు ఉన్నాయి.
కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్: ఫీచర్లు
కవాసాకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ (Kawasaki Ninja ZX-4RR) లో కాంపాక్ట్ సైజ్ తో అద్భుతమైన ట్రాక్ టూల్. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 4.3 అంగుళాల టిఎఫ్టి స్క్రీన్ ఉంటుంది. ఈ బైక్ నాలుగు రైడింగ్ మోడ్ లతో వస్తుంది. ఆల్-ఎల్ఇడి లైటింగ్ ఈ బైక్ మరో ప్రత్యేకత. అయితే, పరిమిత సంఖ్యలో ఇంపోర్ట్ చేస్తున్నందున ఆసక్తి ఉన్న వారు వెంటనే మీ సమీపంలోని కవాసాకి డీలర్ ను త్వరగా సంప్రదించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
టాపిక్