Harley Davidson Nightster మూడు రంగులలో.. మూడు రైడింగ్ మోడ్​లలో లభ్యం.. ధర ఎంతంటే-harley davidson nightster launched in india here is the price and features ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Harley Davidson Nightster మూడు రంగులలో.. మూడు రైడింగ్ మోడ్​లలో లభ్యం.. ధర ఎంతంటే

Harley Davidson Nightster మూడు రంగులలో.. మూడు రైడింగ్ మోడ్​లలో లభ్యం.. ధర ఎంతంటే

Geddam Vijaya Madhuri HT Telugu
Aug 11, 2022 01:28 PM IST

Harley Davidson Nightsterను భారత్​లో విడుదల చేశారు. దీని ధర రూ.14.99 లక్షలు, రూ.15.13 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నైట్‌స్టర్ నాలుగు నెలల క్రితమే అంతర్జాతీయంగా అరంగేట్రం చేసింది. హార్లే డేవిడ్‌సన్ దీనిని చాలా త్వరగా ఇండియాలో లాంఛ్ చేసింది. మరి ఈ అద్భుతమైన బైక్ ఫీచర్లు, కలర్స్ వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

<p>Harley Davidson Nightster price</p>
Harley Davidson Nightster price

Harley Davidson Nightster : హార్లే-డేవిడ్సన్ నైట్‌స్టర్ అధికారికంగా భారతదేశానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హార్లే-డేవిడ్సన్ డీలర్‌షిప్‌లలో నైట్‌స్టర్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇది US బైక్‌మేకర్ నుంచి తేలికైన బైక్, సరికొత్త 975cc రివల్యూషన్ మ్యాక్స్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఈ ద్విచక్ర వాహనం కంపెనీ స్పోర్ట్ శ్రేణిలో భారతదేశానికి వచ్చిన రెండవ బైక్.

హార్లే-డేవిడ్సన్​ US-ఆధారిత వాహన తయారీదారులలో ఒకటి. స్పోర్ట్, డైనా, సాఫ్టెయిల్, వి-రాడ్, టూరింగ్, స్ట్రీట్ అనే ఆరు ప్లాట్‌ఫారమ్‌లలో 11 మోడళ్లను అందిస్తూ.. 2009లో భారతీయ తీరంలో అడుగు పెట్టింది. 2022 నైట్‌స్టర్ తప్పనిసరిగా స్పోర్ట్ శ్రేణిని పునరుద్ధరించడానికి ఉద్దేశించిన సరికొత్త మోడల్​గా చెప్పవచ్చు.

Harley Davidson Nightster ఫీచర్లు

క్రూయిజర్‌లో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్​తో Harley Davidson Nightster వచ్చింది. ఇది ఒక సాధారణ క్రూయిజర్ సిల్హౌట్‌ను కలిగి ఉంది. అండర్-సీట్ 12-లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, టియర్‌డ్రాప్-ఆకారపు ఎయిర్‌బాక్స్, విశాలమైన హ్యాండిల్‌బార్, హౌసింగ్‌తో కూడిన రౌండ్ LED హెడ్‌లైట్లు, రైడర్-ఓన్లీ శాడిల్, పెద్ద ఫెండర్‌ను కలిగి ఉంది.

ఇది సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్యాక్ చేస్తుంది. 19-అంగుళాల (ముందు), 16-అంగుళాల (వెనుక) అల్లాయ్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. ఇది మూడు రంగులలో లభిస్తుంది. వివిడ్ బ్లాక్, గన్‌షిప్ గ్రే, రెడ్‌లైన్ రెడ్.

Harley Davidson Nightster ఇంజిన్

నైట్‌స్టర్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించారు. 975cc, లిక్విడ్-కూల్డ్, V-ట్విన్ రివల్యూషన్ మ్యాక్స్ ఇంజిన్ నుంచి శక్తిని తీసుకుంటుంది. మిల్లు 7,500rpm వద్ద గరిష్టంగా 90hp శక్తిని, 5,000rpm వద్ద 95Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది.

Harley Davidson Nightster భద్రత

రైడర్ భద్రత కోసం 2022 నైట్‌స్టర్ ముందు, వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లతో పాటు డ్యూయల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థొరెటల్, మూడు రైడింగ్ మోడ్‌లు: రోడ్, రెయిన్, స్పోర్ట్‌తో వస్తుంది.

మోటార్‌సైకిల్ వెనుక భాగంలో 41mm షోవా "డ్యూయల్ బెండింగ్ వాల్వ్" టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు డ్యూయల్ షాక్-అబ్జార్బర్ యూనిట్‌లు ఉన్నాయి.

Harley Davidson Nightster ధర

భారతదేశంలో హార్లే-డేవిడ్సన్ 2022 నైట్‌స్టర్ మోడల్ వివిడ్ బ్లాక్‌లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 14.99 లక్షలు. గన్‌షిప్ గ్రే, రెడ్‌లైన్ రెడ్ ధర రూ. 15.13 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

Whats_app_banner