JioPhone 5G : ఇదిగో జియోఫోన్​ 5జీ.. ఫీచర్స్​, ధర వివరాలివే!-jiophone 5g to launch soon check details of features and price here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jiophone 5g : ఇదిగో జియోఫోన్​ 5జీ.. ఫీచర్స్​, ధర వివరాలివే!

JioPhone 5G : ఇదిగో జియోఫోన్​ 5జీ.. ఫీచర్స్​, ధర వివరాలివే!

Sharath Chitturi HT Telugu
Jul 01, 2023 07:39 AM IST

JioPhone 5G : జియోఫోన్​ 5జీ​ పిక్స్​ ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. దీపావళి లేదా న్యూ ఇయర్​ నాటికి ఈ స్మార్ట్​ఫోన్​ ఇండియాలో లాంచ్​కానుంది!

ఇదిగో జియోఫోన్​ 5జీ.. ఫీచర్స్​, ధర వివరాలివే!
ఇదిగో జియోఫోన్​ 5జీ.. ఫీచర్స్​, ధర వివరాలివే! (twitter/ @ArpitNahiMila)

JioPhone 5G : రిలయెన్స్​ జియో నుంచి త్వరలోనే ఓ 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​కానుంది. అధికారిక ప్రకటనకు ముందే.. ఈ జియోఫోన్​ 5జీ మొబైల్​కు సంబంధించిన ఫొటోలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. అంతేకాకుండా.. స్మార్ట్​ఫోన్​ ధరతో పాటు ఇతర వివరాలు సైతం బయటకొచ్చాయి.

జియో 5జీ స్మార్ట్​ఫోన్​ విశేషాలు..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలను తీసుకొచ్చేందుకు రిలయన్స్​ జియో కృషిచేస్తోంది. ఇప్పటికే 5,650 ప్రాంతాల్లో జియో సేవలు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇక 5జీ సేవలతో పాటు 5జీ స్మార్ట్​ఫోన్​ని కూడా లాంచ్​ చేసేందుకు సంస్థ ప్లాన్​ చేస్తోంది. లాంచ్​ తర్వాత.. రెడ్​మీ, సామ్​సంగ్​, లావా బ్రాండ్స్​కు చెందిన ఎంట్రీ లెవల్​ ఫోన్స్​కు ఈ జియోఫోన్​ 5జీ గట్టిపోటీనిస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

లీక్​ అయిన ఫొటో ప్రకారం.. జియోఫోన్​ 5జీలో ఫ్రెంట్​లో.. వాటర్​డ్రాప్​ స్టైల్​ నాచ్​, రేర్​లో వర్టికల్లీ అలైన్డ్​ డ్యూయెల్​ కెమెరా, ఎల్​ఈడీ ఫ్లాష్​ వంటివి వస్తున్నాయి. జియో లోగోతో పాటు 5జీ, అల్టిమేట్​ స్పీడ్​, అన్​లిమిటెడ్​ ఎక్స్​పీరియన్స్​ వంటివి కూడా రేర్​లో ముద్రించి ఉన్నాయి.

పలు నివేదికల ప్రకారం.. ఈ జియో 5జీ స్మార్ట్​ఫోన్​లో సైడ్​ ఫేసింగ్​ ఫింగర్​ప్రింట్​ స్కానర్​, 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.5 ఇంచ్​ ఎల్​సీడీ స్క్రీన్​, 13ఎంపీ ప్రైమరీ, 2ఎంపీ మాక్రో కెమెరా ఫీచర్స్​ ఉంటాయి. సెల్ఫీ కోసం 5ఎంపీ లేదా 8ఎంపీ కెమెరా లభించే అవకాశం ఉంది.

జియోఫోన్​ 5జీలో యూనిసోక్​ లేదా మీడియాటెక్​ డైమెన్సిటీ 700 ఎస్​ఓసీ చిప్​సెట్​ ఉండొచ్చు. 4జీబీ ర్యామ్​, 32జీబీ స్టోరేజ్​ వంటివి ఉండే అవకాశం ఉంది. ఎక్​పాండెబుల్​ మైక్రో ఎస్​డీ కార్డ్​ కూడా లభిస్తుంది. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీ, 18వాట్​ ఛార్జింగ్​ కెపాసిటీ దీని సొంతం అవ్వొచ్చు.

వైఫై, బ్లూటూత్​ 5.1 జీబీఎస్​, టైప్​-సీ పోర్ట్​, 5జీ కనెక్టివీటీ ఫీచర్స్​ను ఈ డివైజ్​ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్​ 12పై పనిచేయవచ్చు. ఈ ఏడాది దీపావళి లేదా న్యూ ఇయర్​ సమయానికి ఈ జియోఫోన్​ 5జీ మార్కెట్​లో లాంచ్​ అవ్వొచ్చు. రూ. 10వేల సెగ్మెంట్​లో ఇది అందుబాటులోకి రావచ్చు. ఇదే జరిగితే.. లావా బ్లేజ్​ 5జీకి గట్టి పోటీ తప్పదని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనం