Jawa 350 in India: మరింత పవర్ ఫుల్ ఇంజన్ తో ఇండియన్ మార్కెట్లోకి జావా 350; ధర కూడా అందుబాటులోనే..
Latest Jawa 350 in India: ఒకప్పుడు భారతీయ రోడ్లపై పరుగులు తీసిన జావా 350 బైక్ ఇప్పుడు మరింత శక్తిమంతమైన ఇంజన్, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మరోసారి జావా అభిమానులను అలరించడానికి సిద్ధమైంది.
Latest Jawa 350 in India: భారతదేశంలో సరికొత్త జావా 350 మోటార్ సైకిల్ ను జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ విడుదల చేసింది. రీ డిజైన్డ్ ఛాసిస్, పవర్ ఫుల్ ఇంజిన్, రెట్రో-థీమ్ డిజైన్ తో ఈ బైక్ ను తీర్చి దిద్దారు.
ధర రూ. 2.15 లక్షలు..
ఈ లేటెస్ట్ జావా 350 (Latest Jawa 350) బైక్ ఎక్స్ షో రూమ్ ధరను రూ. 2.15 లక్షలుగా నిర్ణయించారు. ఈ మోడల్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న జావా స్టాండర్డ్ కన్నా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ను కలిగి ఉంది. అలాగే, జావా స్టాండర్డ్ మోడల్ కన్నా దీని ధర సుమారు రూ .12,000 ఎక్కువ ఉంటుంది.
డిజైన్
ఇటీవల విడుదలైన జావా 350 మోటార్ సైకిల్ దాని మునుపటి స్టాండర్డ్ మోడల్ తో పోలిస్తే మరింత డైనమిక్ గా కనిపిస్తుంది. బైక్ డిజైన్ లో కీలకకమైన మార్పులు చేశారు. ఫెండర్లను రీ డిజైన్ చేశారు. రైడింగ్ సౌకర్యాన్ని పెంచడానికి సీటు డిజైన్ ను కూడా అప్ గ్రేడ్ చేశారు. మల్టీ స్పోక్ వీల్స్ ను అమర్చారు. ఈ కొత్త మోడల్ జావా 350 మెరూన్, బ్లాక్, మిస్టిక్ ఆరెంజ్ కలర్ స్కీమ్స్ లో లభిస్తుంది.
డైమెన్షన్స్
లేటెస్ట్ గా సోమవారం లాంచ్ చేసిన జావా 350 లో పలు డైమెన్షన్స్ లో స్వల్ప మార్పులు చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ ను 178 మిమీ పెంచారు. ఎత్తు 790 మిమీ ఉంటుంది. 1,449 ఎంఎం వీల్ బేస్ ఉంది. అంటే, మునుపటి మోడల్ కంటే కొత్త జావా 350 పొడవైనది. మొత్తంగా తాజా మోడల్ బరువు 194 కిలోలుగా ఉంది. మునుపటి స్టాండర్డ్ మోడల్ బరువు 182 కిలోలు.
పవర్ ట్రెయిన్
ఈ లేటెస్ట్ జావా 350 ని కూడా డ్యూయల్ క్రేడిల్ ఛాసిస్ పై నిర్మించారు. తాజా జావా 350 లో 334 సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ తో ఆరు-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ కొత్త ఇంజన్ గరిష్టంగా 22 బిహెచ్ పీ శక్తిని, 28.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ లేటెస్ట్ జావా 350 లో 18-17 అంగుళాల మల్టీ-స్పోక్ వీల్స్ ఉన్నాయి.
టాపిక్