ITR filing 2023: సీనియర్ సిటిజన్లు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాలా? వద్దా?.. ఈ కేటగిరీలకు మాత్రమే మినహాయింపు..
ITR filing 2023: ఈ సంవత్సరం ఆదాయపన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ దగ్గరపడుతోంది. ఈ నెల 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, మేము కూడా ఐటీఆర్ దాఖలు చేయాలా? అన్నది చాలా మంది సీనియర్ సిటిజన్స్ ను వేధిస్తున్న ప్రశ్న.. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడండి..
ITR filing 2023: ఈ సంవత్సరం ఆదాయపన్ను రిటర్న్స్ (ITR) ను దాఖలు చేయడానికి ఆఖరు తేదీ దగ్గరపడుతోంది. ఈ నెల 31 లోపు ఐటీఆర్ (income tax returns) ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే, మేము కూడా ఐటీఆర్ దాఖలు చేయాలా? అన్నది చాలా మంది సీనియర్ సిటిజన్స్ ను వేధిస్తున్న ప్రశ్న.. ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ చూడండి..
senior citizens ITR filing: సీనియర్ సిటిజన్స్ ఐటీఆర్ ఫైలింగ్
సీనియర్ సిటిజన్స్ లో అర్హులైన కొన్ని కేటగిరీల వారికి ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడం నుంచి మినహాయింపునిస్తూ 2021 బడ్జెట్ లో ప్రకటించారు. అందుకోసం, ఆదాయ పన్ను చట్టంలో కొత్తగా 194పీ ని చేర్చారు. ఆ సెక్షన్ ప్రకారం.. 75 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులు, కొన్ని షరతులకు లోబడి ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ డిపాజిట్ అవుతున్న బ్యాంక్ కు, వడ్డీ ఆదాయం లభిస్తున్న బ్యాంక్ లకు ముందే డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ఐటీఆర్ ను ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు.
వీరు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయనక్కర లేదు
ఆదాయపన్ను చట్టంలోని 194పీ సెక్షన్ ప్రకారం..
- 75 సంవత్సరాల వయస్సు దాటిన వృద్ధులు, కొన్ని షరతులకు లోబడి ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు.
- పెన్షన్ డిపాజిట్ అవుతున్న బ్యాంక్ కు, వడ్డీ ఆదాయం లభిస్తున్న బ్యాంక్ లకు ముందే డిక్లరేషన్ ఇవ్వడం ద్వారా ఐటీఆర్ ను ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు.
- 2023 మార్చి 31 నాటికి 75 సంవత్సరాల వయస్సు దాటిన భారతీయ పౌరులు ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయనక్కర లేదు.
- పెన్షన్ లేదా బ్యాంక్ వడ్డీ మినహా వేరే ఆదాయ వనరు ఉండకూడదు.
- పన్ను మినహాయింపు పరిధిలోకి వచ్చే ఆదాయం మాత్రమే ఉన్నవారు కూడా ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు.
- ఒకవేళ ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలో ఉన్నప్పటికీ.. వారి పెన్షన్ లేదా వడ్డీ ఆదాయంపై బ్యాంక్ టీడీఎస్ వసూలు చేస్తే, ఆ మొత్తం రీఫండ్ కావాలంటే ఐటీఆర్ దాఖలు చేయక తప్పదు.
- పెన్షన్ డిపాజిట్ అవుతున్న బ్యాంక్ లోనే ఎఫ్ డీ కూడా ఉండి, ఆ ఎఫ్ డీ నుంచి ఆదాయం వస్తుంటే, బ్యాంక్ కు సమాచారం ఇచ్చి, టీడీఎస్ చెల్లింపునకు అనుమతి ఇవ్వవచ్చు. వీరు ఐటీఆర్ దాఖలు చేయనక్కర లేదు.