ITR filing 2023 : ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి..
ITR filing 2023: ఐటీఆర్ ఫైలింగ్‌కు గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో పన్నుచెల్లింపుదారులు తెలుసుకోవాల్సిన విషయం ఇది. అదేంటంటే..
ITR filing 2023 : 2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఐటీఆర్ (ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్) ఫైలింగ్ హడావుడి మొదలైంది. చాలా మంది వేతన జీవులకు ఇప్పటికే ఫార్మ్ 16 అంది ఉంటుంది. అయితే.. ఐటీఆర్ ఫైలింగ్‌కి ముందు సంబంధిత బ్యాంక్ అకౌంట్‌ను ప్రీ-వాలిడేట్ చేసుకోవడం చాలా కీలకం. మరీ ముఖ్యంగా, ఎక్కువ ట్యాక్స్ చెల్లించి, రీఫండ్ కోసం ఎదురుచూసే వారు తమ బ్యాంక్ అకౌంట్లను కచ్చితంగా ప్రీ వాలిడేట్ చేసుకోవాలి. లేకపోతే.. ఐటీశాఖ రీఫండ్ చేయలేకపోవచ్చు.
ఇక ఇప్పుడు.. ఈ- పే ట్యాక్స్ సేవలను డీసీబీ బ్యాంక్ మొదలుపెట్టింది. ఓవర్ కౌంటర్, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్స్‌తో ఈ సేవలను ఇస్తోంది. ఫలితంగా.. ట్యాక్స్ పేమెంట్స్ కోసం ఈ- పే ట్యాక్స్ సర్వీసు అందుబాటులో ఉన్న బ్యాంక్‌ల సంఖ్య 25కు చేరింది. అవి..
యాక్సిస్ బ్యాంక్
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
కెనరా బ్యాంక్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సిటీ యూనియన్ బ్యాంక్
డీసీబీ బ్యాంక్
ఫెడరల్ బ్యాంక్
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్
ఐడీబీఐ బ్యాంక్
ఇండియన్ బ్యాంక్
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
ఇండస్ఇండ్ బ్యాంక్
జమ్ముకశ్మీర్ బ్యాంక్
కరూర్ వైశ్య బ్యాంక్
కొటాక్ మహీంద్రా బ్యాంక్
పంజాబ్ నేషనల్ బ్యాంక్
పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్
ఆర్బీఎల్ బ్యాంక్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
యూకో బ్యాంక్
యూనియన్ బ్యాంక్.
ఈ తప్పులు చేయకండి..
ట్యాక్స్ ఫైలింగ్‌లో చాలా మంది సాధారణంగా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్‌ని వెరిఫై చేయకపోవడం ఇందులో ఒకటి. ఐటీశాఖ నుంచి నోటిసులు వచ్చినప్పుడే, పన్నుచెల్లింపుదారులకు ఇది గుర్తొస్తుంది. తప్పు జరిగిపోతే, సరిచేసుకోవడానికి చాలా సమయం పడుతుంది.
ప్రస్తుతం.. ఐటీఆర్ ఫార్మ్ సబ్మీట్ చేసిన 30 రోజులలోపు ఐటీఆర్‌ను వెరిఫై చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఐటీఐర్ ఫైలింగ్‌కు డెడ్‌లైన్..
ఎఫ్వై2022-23 ఐటీఆర్ ఫైలింగ్‌కు జులై 31 డెడ్‌లైన్. ఈలోపే ఇన్కమ్ ట్యాక్స్‌ను ఫైల్ చేయాలి. లేకపోతే ఆదాయపు పన్నుశాఖ నుంచి భారీగా పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది.
సంబంధిత కథనం