IREDA IPO listing: 50 శాతం పైగా ప్రీమియంతో ఐఆర్ఈడీఏ ఐపీఓ బంపర్ లిస్టింగ్; షేర్స్ అలాట్ అయినవారికి పండుగే..-ireda share price debuts at 56 25 percent premium at 50 rupees on nse ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ireda Ipo Listing: 50 శాతం పైగా ప్రీమియంతో ఐఆర్ఈడీఏ ఐపీఓ బంపర్ లిస్టింగ్; షేర్స్ అలాట్ అయినవారికి పండుగే..

IREDA IPO listing: 50 శాతం పైగా ప్రీమియంతో ఐఆర్ఈడీఏ ఐపీఓ బంపర్ లిస్టింగ్; షేర్స్ అలాట్ అయినవారికి పండుగే..

HT Telugu Desk HT Telugu
Nov 29, 2023 12:01 PM IST

IREDA IPO listing: ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఈడీఏ (IREDA) బుధవారం బంపర్ లిస్టింగ్ తో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది. ఉదయం ఎన్ఎస్ఈ లో 56.25% ప్రీమియంతో రూ. 50 లతో ఓపెన్ అయింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

IREDA IPO listing: ఐఆర్ఈడీఏ ఐపీఓ (Indian Renewable Energy Development Agency - IREDA IPO) బంపర్ లిస్టింగ్ తో ఓపెన్ అయింది. రూ. 32 ఇష్యూ ప్రైస్ తో వచ్చిన ఈ స్టాక్ బుధవారం ఉదయం రూ. 50 లతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఓపెన్ అయింది. అప్పటి నుంచి ఈ ధర పెరుగుతూనే పోతోంది.

రూ. 58..

బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి బీఎస్ఈ లో ఈ ఐఆర్ఈడీఏ (IREDA) షేరు ధర 79% ప్రీమియంతో రూ. 58 గా ట్రేడ్ అవుతోంది. ఈ ఐపీఓ రూ. 32 ఇష్యూ ప్రైస్ తో అలాట్ అయింది. నవంబర్ 21న ఐఆర్ఈడీఏ ఐపీఓ మార్కెట్లోకి వచ్చింది. నవంబర్ 23వ తేదీన ముగిసింది. రూ. 30 - రూ. 32 ప్రైస్ బ్యాండ్ తో ఒక్కో లాట్ లో రూ. 10 ముఖ విలువ కలిగిన 460 ఈక్విటీ షేర్లతో ఈ ఐపీఓ వచ్చింది. నవంబర్ 25న అర్హులైన ఇన్వెస్టర్లకు అలాట్మెంట్ జరిగింది. నవంబర్ 29వ తేదీన స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయింది.

ఐపీఓకు భారీ స్పందన

ఈ ఐఆర్ఈడీఏ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తంగా ఇది 38.80 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. అదులో ఎన్ఐఐ వాటా 24.16 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 7.73 రెట్లు, క్యూఐబీ వాటా 104.57 రెట్లు సబ్ స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా జారీ చేస్తున్న మొత్తం షేర్లలో 50% లకు, 15% ఎన్ఐఐలకు, 35% రిటైల్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు.

Whats_app_banner