IREDA IPO allotment: ఐఆర్ఈడీఏ ఐపీఓ అలాట్మెంట్ ముగిసింది.. మీకు అలాట్ అయ్యాయో, లేదో ఇలా తెలుసుకోండి..-ireda ipo allotment finalised latest gmp how to check allotment status ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ireda Ipo Allotment: ఐఆర్ఈడీఏ ఐపీఓ అలాట్మెంట్ ముగిసింది.. మీకు అలాట్ అయ్యాయో, లేదో ఇలా తెలుసుకోండి..

IREDA IPO allotment: ఐఆర్ఈడీఏ ఐపీఓ అలాట్మెంట్ ముగిసింది.. మీకు అలాట్ అయ్యాయో, లేదో ఇలా తెలుసుకోండి..

HT Telugu Desk HT Telugu
Nov 25, 2023 06:37 PM IST

IREDA IPO: ఐఆర్ఈడీఏ ఐపీఓ అలాట్మెంట్ పూర్తయింది. ఈ ఐపీఓకు అప్లై చేసిన ఇన్వెస్టర్లు లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పోర్టల్‌లో అలాట్మెంట్ అయ్యాయో, లేదో తెలుసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: Courtesy company website)

IREDA IPO allotment: నవంబర్ 25వ తేదీన ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (IREDA) ఐపీఓ అలాట్మెంట్ ముగిసింది. ఈ ఐపీఓ నవంబర్ 21న ప్రారంభమై, నవంబర్ 23న ముగిసింది. ఈ ఐపీఓలో ఒక్కో లాట్ లో 460 షేర్లకు గరిష్టంగా రూ. 32 ఇష్యూ ప్రైస్ పై అప్లై చేసుకోవచ్చు.

నవంబర్ 30 న రీఫండ్

ఈ IREDA ఐపీఓలో షేర్లు పొందని వారికి రీఫండ్ ప్రక్రియ నవంబర్ 30నుంచి ప్రారంభమవుతుంది. అలాగే, షేర్లు అలాట్ అయినవారి డిమ్యాట్ ఖాతాల్లోకి డిసెంబర్ 1 శుక్రవారం నాడు జమ అవుతాయి. అలాగే, డిసెంబర్ 4వ తేదీన ఈ సంస్థ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవనుంది. ఈ ఐపీఓ కు అప్లై చేసుకుని, అలాట్మెంట్ పరిస్థితిని తెలుసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు ఈ కింది స్టెప్స్ ఫాలో కావడం ద్వారా తమకు షేర్లు అలాట్ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు.

1] linkintime.co.in/MIPO/Ipoallotment.html లింక్ ద్వారా నేరుగా లాగిన్ అవ్వండి.

2] IREDA IPOని ఎంచుకోండి.

3] మీ PAN వివరాలను నమోదు చేయండి.

4] 'Search' బటన్ పై క్లిక్ చేయండి.

5] మీకు షేర్లు అలాట్ అయితే, ఆ వివరాలు, అలాట్ కానట్లయితే, ఆ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

బీఎస్ఈ లింక్ పై..

1] డైరెక్ట్ గా బీఎస్ఈ లింక్ bseindia.com/investors/appli_check.aspx BSE పై క్లిక చేసి, లాగిన్ అవ్వండి.

2] IREDA IPOని ఎంచుకోండి

3] IREDA IPO అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయండి

4] మీ పాన్ వివరాలను నమోదు చేయండి

5] 'నేను రోబో కాదు'పై క్లిక్ చేయండి

6] 'సబ్మిట్' బటన్‌పై క్లిక్ చేయండి.

7] మీకు షేర్లు అలాట్ అయితే, ఆ వివరాలు, అలాట్ కానట్లయితే, ఆ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.

Whats_app_banner