IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..-iqoo z9x 5g launched in india at rs 12999 check specs features price and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iqoo Z9x 5g Launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

IQOO Z9x 5G launch: ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్; ధర, ఫీచర్స్ ఇవే..

HT Telugu Desk HT Telugu
May 16, 2024 03:44 PM IST

IQOO Z9x 5G launch: ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు భారత్ లో లాంచ్ అయింది. 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ రూ. 12,999 లకే లభిస్తుంది. ఈ ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర.. ఇతర వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్
ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ (IQOO)

IQOO Z9x 5G launch: కొన్ని నెలల ఎదురుచూపుల తరువాత, ఐక్యూ ఎట్టకేలకు భారతదేశంలో కొత్త ఐక్యూ జెడ్ 9 ఎక్స్ 5 జీని విడుదల చేసింది. ఇప్పటికే చైనా, మలేషియాలో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు కొన్ని అద్భుతమైన ఫీచర్లతో, అత్యంత సరసమైన ధరలో భారత్ లోకి అడుగుపెడుతోంది. గత కొన్ని వారాలుగా, బ్యాటరీ, ప్రాసెసర్, ఇతర స్పెసిఫికేషన్లను బహిర్గతం చేస్తూ ఈ స్మార్ట్ ఫోన్ ను కంపెనీ నిరంతరం టీజ్ చేసింది. ఇప్పుడు ఐక్యూ వెబ్ సైట్ లో ఈ ఐక్యూ జడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఐక్యూ జెడ్9ఎక్స్ లో ఏముందో తెలుసుకోండి.

ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు

ఐక్యూ జెడ్9ఎక్స్ స్మార్ట్ ఫోన్ (IQOO Z9x 5G) లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో, 1000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్ నెస్ తో 6.72 అంగుళాల మల్టీ టచ్ ఎల్ సీడీ డిస్ ప్లే ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 5జీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను అందించారు. ఐక్యూ జెడ్9ఎక్స్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి టోర్నడో గ్రీన్, స్టార్మ్ గ్రే. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.

డ్యూయల్ కెమెరా సెటప్

ఐక్యూ జెడ్ 9ఎక్స్ 5 జీ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ఏఐ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బోకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేసే 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 రోజుల బ్యాటరీ లైఫ్ ను ఇది అందిస్తుంది. ఈ ఐక్యూ జెడ్ 9ఎక్స్ ఐపీ 64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.

ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ ధర, లభ్యత

ఐక్యూ జెడ్9ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ (amazon) లో కొనుగోలు చేయవచ్చు. రూ.12,999 ధరకు ఈ ఫోన్ వినియోగ దారులకు లభ్యం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ సేల్ మే 21 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. అమేజాన్ లో ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసినవారికి అదనంగా బ్యాంక్ డిస్కౌంట్లు లభిస్తాయి.