iQOO 12 : ఐకూ 12 సిరీస్ లాంచ్ త్వరలోనే! ఫీచర్స్ ఇవేనా..?
iQOO 12 : ఐకూ 12 త్వరలోనే లాంచ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాము..
iQOO 12 : ఐకూ సంస్థ నుంచి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్‌కు సిద్ధమవుతోంది! దీని పేరు ఐకూ 12. ఈ ఫ్లాగ్షిప్ మోడల్ వచ్చే నెలలోనే మార్కెట్లోకి అడుగుపెడుతుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్ ఫీచర్స్, ధరపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐకూ 12 ఎలా ఉంటుందంటే..!
రూమర్స్ ప్రకారం.. ఐకూ 12 వైట్ అండ్ గ్లాస్ ఎడిషన్స్‌లో అందుబాటులోకి వస్తుంది. రెడ్ వీగన్ లెథర్ ఆప్షన్ కూడా ఉండొచ్చు. ఇందులో 2కే రిసొల్యూషన్, 144 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, అల్ట్రాసానిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింటర్ రీడర్‌తో కూడిన అమోలెడ్ డిస్ప్లే ఉండనుంది.
iQOO 12 launch date India : ఈ ఐకూ 12లో 50ఎంపీ ప్రైమరీ, 64ఎంపీ టెలిఫొటో లెన్స్, 50ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉండొచ్చు. ఫ్రెంట్ కెమెరాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ చిప్సెట్ ఉండొచ్చు. ఈ ప్రాసెసర్ ఇంకా లాంచ్ అవ్వలేదు. రానున్న వారాల్లో ఇది అందుబాటులోకి వస్తుంది.
iQOO 12 release date : ఇక ఈ ఐకూ 12లో 4,880ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. 120వాట్ ఫాస్ట్ వయర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉండనుంది. చూస్తుంటే.. ఇదొక మిడ్ రేంజ్ సెగ్మెంట్‌గా కనిపిస్తోంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌గా దీనిని ఐకూ సంస్థ లాంచ్ చేయొచ్చు!
ఈ మోడల్ ఫీచర్స్, ధరకు సంబంధించిన ఇతర వివరాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. రానున్న రోజుల్లో వీటిపై ఓ స్పష్టత వస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్…!
Vivo Y33t ఇక ఇతర విషయాలకొస్తే. వరుస స్మార్ట్‌ఫోన్స్ లాంచ్‌తో బిజీబిజీగా ఉంటోంది వివో సంస్థ. తాజాగా.. మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీని పేరు వివో వై33టీ. చైనాలో ఈ గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ జీ85 ప్రాసెసర్ ఉంటుంది. 6జీబీ ర్యామ్- 128జీబీ స్టోరేజ్ వేరియంట్ దీని సొంతం. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కి ఇది డీసెంట్ ఆప్షన్ అనే చెప్పుకోవాలి. అంతేకాకుండా.. ఇందులో 6జీబీ వర్చ్యువల్ ఎక్స్పాండెబుల్ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక ఈ వివో ఫోన్.. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆరిజిన్ఓఎస్ 3 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం