iPhone 15 series price: నేటి నుంచే ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రి బుకింగ్; ధరల వివరాలు ఇవే..; ఇలా ఆర్డర్ చేయండి..-iphone 15 series how to pre order apples newest iphone online ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Iphone 15 Series Price: నేటి నుంచే ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రి బుకింగ్; ధరల వివరాలు ఇవే..; ఇలా ఆర్డర్ చేయండి..

iPhone 15 series price: నేటి నుంచే ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రి బుకింగ్; ధరల వివరాలు ఇవే..; ఇలా ఆర్డర్ చేయండి..

HT Telugu Desk HT Telugu
Sep 15, 2023 08:40 PM IST

iPhone 15 series price: సెప్టెంబర్ 12 వ తేదీన జరిగిన యాపిల్ ఈవెంట్ లో ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేశారు. వాటి ప్రి ఆర్డర్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం అయింది. సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమవుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Apple)

iPhone 15 series price: ఐఫోన్ 15 సిరీస్ ఫ్రీ ఆర్డర్ బుకింగ్స్ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్లు సెప్టెంబర్ 12న జరిగిన ఆపిల్ వండర్లాస్ట్ ఈవెంట్లో లాంచ్ అయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్ లో ఐఫోన్ 15, ఐ ఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ మోడల్స్ ఉన్నాయి. ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ప్రి బుకింగ్ సెప్టెంబర్ 15న ప్రారంభమవుతుందని లాంచ్ సమయంలోనే ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి సేల్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. కొత్త ఐఫోన్ 15 మోడల్స్ లో డైనమిక్ ఐలాండ్, 48 ఎంపీ కెమెరా, ఏ 16 బయోనిక్ ఎస్ఓసి మొదలైన ఫీచర్స్ ఉన్నాయి. ఐ ఫోన్ 15 ప్రో మోడల్ లో టైటానియం ఫ్రేమ్, టెలీ ఫోటో కెమెరా, యాక్షన్ బటన్ ఉన్నాయి. ఐ ఫోన్ 15 సిరీస్ లోని అన్ని ఫోన్లలో యూఎస్బీ టైప్ సి చార్జింగ్ పోర్ట్ ఉంటుంది.

40 దేశాల్లో..

ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను సొంతం చేసుకోవాలని ఆలోచనలో ఉంటే.. సాధ్యమైనంత త్వరగా వాటిని పొందాలని ఆలోచనలో ఉంటే.. యాపిల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ రోజు నుంచి ఆ ఫోన్ లని ప్రి ఆర్డర్ చేసుకోవచ్చు. భారత్ సహా దాదాపు 40 దేశాల్లో ఈ ప్రి ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుందని ఆపిల్ ప్రకటించింది. భారత్ లో సెప్టెంబర్ 15 సాయంత్రం 5:30 నుంచి ప్రి ఆర్డర్ కు అవకాశం ఉంటుంది.

iPhone 15 series price: ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు

ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు ఈ విధంగా ఉన్నాయి. భారత్ లో స్టాండర్డ్ ఐఫోన్ 15 ధర 128 జీబీ వేరియంట్ కి రూ. 79,900 గా ఉంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ధర రూ. 89,900 గా ఉంది. ఈ రెండు ఫోన్లు కూడా 128 జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ తో లభిస్తాయి. ఎక్కువ స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్న ఫోన్ ధర కొంత ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఐఫోన్ 15 ప్రో (128 జీబీ వేరియంట్) ధర రూ. 1,34,900 గా ఉంది. ఐఫోన్ 15 ప్రో లో 128 జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ తో పాటు 1 టీబీ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర గణనీయంగా పెరిగింది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ ధర రూ. 1,59,900 (256జీబీ స్టోరేజ్ వేరియంట్)గా ఉంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్ లో 128 జీబీ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. ఇది కేవలం 256జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ ఆప్షన్స్ తో లభిస్తుంది.

iPhone 15 series pre order: ప్రి ఆర్డర్ చేయడం ఎలా?

ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్లను ప్రి ఆర్డర్ చేయాలనుకునే వారు ముందుగా..

  • ఆపిల్ అధికారిక వెబ్సైట్ లోకి వెళ్ళాలి.
  • డ్రాప్ డౌన్ మెన్యూలో ‘షాప్’ ను ఎంచుకోవాలి.
  • మీరు ప్రి ఆర్డర్ చేయాలనుకుంటున్న ఐ ఫోన్ 15 సిరీస్ ఫోన్ ను ఎంపిక చేసుకోవాలి.
  • మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేయాలి అనుకుంటే ట్రేడింగ్ ఆప్షన్ కు వెళ్లాలి.
  • ఆపిల్ కేర్ ప్లస్ కవరేజ్ కావాలనుకుంటే ఆపిల్ కేర్ ప్లస్ కవరేజ్ ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత నెక్స్ట్ పేజీ లోకి వెళ్లి మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, డెలివరీ చేయాల్సిన అడ్రస్, మోడ్ ఆఫ్ డెలివరీ తెలియజేయాలి.
  • ఆ తరువాత పేమెంట్ చేయాలి.
  • దాంతో మీ ప్రి ఆర్డర్ బుక్ అయిపోతుంది.
  • అనంతరం, మీకు ఒక కన్ఫర్మేషన్ ఈ మెయిల్ వస్తుంది.

WhatsApp channel