Infosys Q2 results: క్యూ2లో స్వల్పంగా పెరిగిన ఇన్ఫోసిస్ ఆదాయం; డివిడెండ్ మాత్రం భారీగానే..-infosys q2 results it major infosys announces q2 results and dividend of rs 21 check record date ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infosys Q2 Results: క్యూ2లో స్వల్పంగా పెరిగిన ఇన్ఫోసిస్ ఆదాయం; డివిడెండ్ మాత్రం భారీగానే..

Infosys Q2 results: క్యూ2లో స్వల్పంగా పెరిగిన ఇన్ఫోసిస్ ఆదాయం; డివిడెండ్ మాత్రం భారీగానే..

Sudarshan V HT Telugu
Oct 17, 2024 05:27 PM IST

Infosys Q2 results: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆశించిన ఫలితాలను సాధించలేదు. ఈ క్యూ 2 లో ఇన్ఫోసిస్ రూ .6,506 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. కాగా, క్యూ 2 ఫలితాలతో పాటు షేర్ హోల్డర్లకు డివిడెండ్ ను కూడా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ప్రకటించింది.

క్యూ2లో స్వల్పంగా పెరిగిన ఇన్ఫోసిస్ ఆదాయం
క్యూ2లో స్వల్పంగా పెరిగిన ఇన్ఫోసిస్ ఆదాయం

Infosys Q2 dividend: ఇన్ఫోసిస్ బోర్డు తన రెండవ త్రైమాసిక ఫలితాలతో పాటు అర్హులైన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ .21 మధ్యంతర డివిడెండ్ ను ప్రకటించింది, ఇందుకోసం అక్టోబర్ 29 ను రికార్డు తేదీగా నిర్ణయించింది. అలాగే, డివిడెండ్ చెల్లింపు తేదీగా నవంబర్ 9ని కంపెనీ నిర్ణయించింది. ‘‘అక్టోబర్ 16, 17 తేదీల్లో జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 21 /- మధ్యంతర డివిడెండ్ (dividend) ను ప్రకటించారు. అక్టోబర్ 29, 2024 ను రికార్డు తేదీగా, నవంబర్ 8, 2024 ను చెల్లింపు తేదీగా నిర్ణయించారు’’ అని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన ఫైలింగ్ లో తెలిపింది.

ఇన్ఫోసిస్ క్యూ2 ఫలితాలు 2024

సెప్టెంబర్ తో ముగిసిన రెండవ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ పన్ను అనంతర లాభం రూ .6,506 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇన్ఫోసిస్ రూ .6,212 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. దాంతో పోలిస్తే ఈ క్యూ2 (Q2FY25) లో సంస్థ 5 శాతం ఎక్కువ నికర లాభాలను ఆర్జించింది. అయితే, ఇది మార్కెట్ అంచనాలైన రూ.6,700 కోట్ల కంటే చాలా తక్కువగా ఉంది. ఇన్ఫోసిస్ ఆపరేషన్స్ ఆదాయం ఈ క్యూ2 లో రూ.40,986 కోట్లుగా ఉంది. ఇది మార్కెట్ అంచనా అయిన రూ.40,890 కోట్ల కంటే కాస్త ఎక్కువ. 2025 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాను 3.75 శాతం నుంచి 4.5 శాతానికి కంపెనీ అప్డేట్ చేసింది.

3.1 శాతం వృద్ధి

రెండో త్రైమాసికంలో (Q2FY25) ఇన్ఫోసిస్ 3.1 శాతం వృద్ధి నమోదు చేసింది. ‘‘ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మంచి ఊపుతో వృద్ధి విస్తృతంగా ఉంది. పరిశ్రమ నైపుణ్యంలో మా బలం, కోబాల్ట్ తో క్లౌడ్ లో మార్కెట్ లీడింగ్ సామర్థ్యాలు, టోపాజ్ తో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫలితంగా మాతో భాగస్వామ్యం కావడానికి క్లయింట్ ప్రాధాన్యత పెరుగుతోంది’’ అని ఇన్ఫోసిస్ (infosys) సీఈఓ, ఎండి సలీల్ పరేఖ్ అన్నారు.

Whats_app_banner