IDFC First Bank Q4 results : ఎఫ్వై24 క్యూ4లో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ దుమ్మురేపింది! సంస్థ లాభాలు రెండింతల కన్నా ఎక్కువ పెరిగి రూ. 803 కోట్లుగా నమోదయ్యాయి. లాభాల పరంగా బ్యాంక్‌కు ఇదే అత్యధికం! ఇక బ్యాంక్ ఎన్ఐఐ (నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్) సైతం డబుల్ డిజిట్ గ్రోత్‌ను సాధించడం విశేషం.
ఎఫ్వై23 నాలుగో త్రైమాసికంలో సంస్థ నెట్ ప్రాఫిట్ 134శాతం వృద్ధిచెంది 803కోట్లకు చేరింది. గత ఆర్థిక ఏడాది క్యూ4లో నెట్ ప్రాఫిట్ రూ. 343కోట్లుగా నమోదైంది. మొత్తం మీద ఎఫ్23 క్యూ4లో బ్యాంక్ ప్యాట్ (ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్) రూ. 2,437 కోట్లుగా రికార్డు అయ్యింది. ఎఫ్22 క్యూ4లో అది కేవలం రూ. 145కోట్లుగా ఉండేది.
IDFC First Bank results : "ఎఫ్వై23 క్యూ4లో బ్యాంక్‌కు అత్యధిక లాభాలు వచ్చాయి. ఇయర్లీ ప్రాఫిట్ కూడా అత్యధికమే. మా బ్యాంక్‌కు ఫౌండేషన్ బలంగా ఉంది. కస్టమర్ల డిపాజిట్లు, లోన్ బుక్ డైవర్సిఫైడ్‌గా ఉంది," అని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఎండీ- సీఈఓ వీ వైద్యనాథన్ తెలిపారు.
సంస్థ ఎన్ఐఐ ఇయర్ ఆన్ ఇయర్లో 35శాతం పెరిగి రూ. 3,597 కోట్లకు పెరిగింది.ఎఫ్వై24 కయూ4లో అది రూ. 2,669కోట్లుగా ఉండేది. జనవరి - మార్చ్ నెలల్లో బ్యాంక్‌కు రూ. 216కోట్ల ట్రేడింగ్ గెయిన్స్ వచ్చాయి. ఇందులోని రూ. 79కోట్లను ప్రావిజన్ కవరేజ్ కోసం వినియోగించింది. బ్యాంక్ ఆర్ఓఈ 12.3శాతంగా ఉంది. ఎఫ్వై22 క్యూ4లో అది 6.67శాతంగా ఉండేది.
IDFC First Bank profits : 2023 మార్చ్ 31 నాటికి బ్యాంక్‌లోని కస్టమర్ల డిపాజిట్లు 47శాతం పెరిగి రూ. 1,36,812కోట్లకు చేరింది. 2022 మార్చ్ 31న అది రూ. 93,214 కోట్లుగా ఉండేది. ఇక గ్రాస్ ఎన్పీఏ (నెట్ నాన్-పర్ఫార్మింగ్ అసెట్) 2.51శాతానికి తగ్గింది. అంటే ఇయర్ ఆన్ ఇయర్లో 119 బేసిస్ పాయింట్లు మెరుగుపడినట్టు!
IDFC First Bank share price : శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఈ బ్యాంక్ షేర్లు 4శాతం పెరిగి రూ. 62 వద్దకు చేరాయి. ఈ స్టాక్ గత ఐదు ట్రేడింగ్ సెషన్స్‌లో 8.7శాతం పెరిగింది. నెల రోజుల్లో 12.62శాతం వృద్ధి చెందింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1.39శాతం మేర పెరిగింది. ఏడాది కాలంలో ఏకంగా 59.59శాతం బలపడింది!
సంబంధిత కథనం