HUL Q4 results: ప్రముఖ ఎఫ్ఎంసీజీ (FMCG) సంస్థ హిందుస్తాన్ యూనీలీవర్ (Hindustan Unilever HUL) 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసిక (Q4FY23) ఫలితాలను గురువారం ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం Q4 తో పోలిస్తే 12.74% వృద్ధితో రూ. 2,601 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. Q4FY22 లో HUL నికర లాభాలు రూ.2,307 కోట్లు.
Q4FY23 ఫలితాలతో పాటు సంస్థ షేర్ హోల్డర్లకు ఫైనల్ డివిడెండ్ ను కూడా HUL ప్రకటించింది. షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 22 ఫైనల్ డివిడెండ్ ఇస్తున్నట్లు వెల్లడించింది. మొత్తంగా 2022 -23 ఆర్థిక సంవత్సరంలో HUL తమ షేర్ హోల్డర్లకు ఒక్కో ఈక్విటీ షేరుపై 39 రూపాయలను డివిడెండ్ (final dividend) గా అందించింది. ఇప్పుడు ప్రకటించిన రూ. 22 ఫైనల్ డివిడెండ్ కన్నా ముందు, నవంబర 2022లో రూ. 17 ల మధ్యంతర డివిడెండ్ (Interim dividend) ను HUL అందించింది.
Q4FY23 లో ఆదాయం (revenue)లో కూడా HUL మెరుగైన ఫలితాలను సాధించింది. Q4FY23 లో HUL రూ. 15,375 కోట్ల ఆదాయం సముపార్జించింది. 2021 -22 ఆర్థిక సంవత్సరం Q4 లో HUL సముపార్జించిన మొత్తం ఆదాయం రూ. 13,846 కోట్లు. మొత్తం నికర అమ్మకాల్లోనూ (consoldated sales) 11% వార్షిక వృద్ధిని HUL నమోదు చేసింది. హోం కేర్ సెగ్మెంట్లో (home care segment) Q4FY23లో సంస్థ ఆదాయం రూ. 5,637 కోట్లు. ఇది Q4FY22 లో HUL సాధించిన రూ. 4,743 కోట్ల ఆదాయం కన్నా 18.85% అధికం. అలాగే, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్లో Q4FY23 లో HUL ఆదాయం రూ. 5,257 కోట్లు. ఇది Q4FY22 లో HUL సాధించిన రూ. 4,743 కోట్ల ఆదాయం కన్నా 10.84% అధికం. HUL షేర్ (share) వాల్యూ గురువారం మధ్యాహ్నానికి 1.45% తగ్గింది. గురువారం మధ్యాహ్నం 2.10 గంటలకు HUL షేర్ విలువ రూ. 2,468.30 గా ఉంది.