IBM layoffs: ఐబీఎం షాకింగ్ నిర్ణయం.. 3,900 మంది ఉద్యోగుల తొలగింపు.. కారణాలివే..
IBM layoffs: మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం ఒకేసారి 3,900 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పూర్తి వివరాలివే..
IBM layoffs: ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఐబీఎం కార్పొరేషన్ (IBM Corp) అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఏకంగా 3,900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వేలాది మంది ఉద్యోగుల మీద లేఆఫ్ పిడుగు వేయగా.. ఆ జాబితాలో ఇప్పుడు ఐబీఎం కూడా చేరింది. 3,900 మంది ఉద్యోగుల తొలగింపును అధికారికంగా ప్రకటించింది.
IBM layoffs: కిండ్రిల్ బిజనెస్ (Kyndyl Business), వాట్సన్ హెల్త్ విభాగాల్లో ఈ లేఆఫ్స్ చేసింది ఐబీఎం. జనవరి, మార్చి మధ్య కాలంలో 300 మిలియన్ డాలర్ల ఖర్చువుతుందని అంచనా వేసిన ఐబీఎం.. ఉద్యోగుల తొలగింపుతో భారం తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది. మొత్తంగా కంపెనీలో 1.5 శాతం మంది ఉద్యోగులను ఐబీఎం తగ్గించుకుంది.
కారణాలు ఇవే..
IBM layoffs: యాన్యువల్ క్యాష్ టార్గెట్ సాధించలేకపోవడం, పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా ఉద్యోగాల తొలగింపు నిర్ణయం తీసుకుంది ఐబీఎం. నాలుగో త్రైమాసికంలో ఆదాయ అంచనాలను అందుకోలేకపోవడం, క్యాష్ ఫ్లో తగ్గడం కూడా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మరోవైపు వార్షిక వృద్ధి కూడా సింగిల్ డిజిట్‍లోనే ఉంటుందని ఐబీఎం అంచనా వేసుకుంది. ఇక ఆర్థిక సంక్షోభం భయాలు కూడా వెంటాడుతున్నాయి.
అయితే, క్లయింట్ ఫేసింగ్ రీసెర్చ్, డెవలప్‍మెంట్ విభాగంలో ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీ ఇంకా ఆసక్తితోనే ఉందని ఉందని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాట్ వెల్లడించారు.
టెక్ దిగ్గజం గూగుల్ ఇటీవలే 12 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కూడా 10 మంది ఉద్యోగులను తీసేస్తున్నామని వెల్లడించింది. ఫేస్‍బుక్ పేరెంట్ కంపెనీ మెటా కూడా 11 మందిని లేఆఫ్స్ చేస్తున్నట్టు చెప్పింది. వీటితో పాటు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా 18వేల మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపునకు ఆదాయం తగ్గడం, ఆర్థిక మాంద్యం భయాలు, అవసరానికి మించిన నియామకాలను కారణాలుగా చూపుతున్నాయి సంస్థలు.
సంబంధిత కథనం