Samsung Phones Discount : శాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి-huge discounts on samsung phones know the features and final price samsung galaxy s24 5g ai samsung galaxy a55 5g ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung Phones Discount : శాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి

Samsung Phones Discount : శాంసంగ్ ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఇంకెందుకు ఆలస్యం ఓ లుక్కేయండి

Anand Sai HT Telugu
Aug 06, 2024 09:21 AM IST

Samsung Phones Discount : మీరు శాంసంగ్ ఫోన్ అభిమాని అయితే మీకు శుభవార్త ఉంది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లలో లభించే టాప్ 3 డీల్స్ గురించి చూద్దాం.. భారీ డిస్కౌంట్లతో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్ గ్రేట్ ఫీడ్ సేల్ జులై 6 మధ్యాహ్నం ప్రారంభం కానుంది. ప్రత్యేకత ఏంటంటే సేల్‌కు ముందే చాలా స్మార్ట్ ఫోన్లకు అదిరిపోయే డీల్స్ వస్తున్నాయి. అదే సమయంలో మీరు శాంసంగ్ అభిమాని అయితే మీకు కూడా గుడ్ న్యూస్ ఉంది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లపై లభించే డీల్స్ గురించి తెలుసుకోవాలి. ఈ ఆఫర్‌లో బ్యాంక్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ ఫోన్లు బంపర్ ఎక్స్చేంజ్ బోనస్‌లతో మీ సొంతం కావచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీ పరిస్థితిపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. శాంసంగ్ ఫోన్లలో ఇస్తున్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 5జీ ఏఐ

8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో రూ.76,999గా ఉంది. బ్యాంక్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.4,250 వరకు తగ్గించుకోవచ్చు. ఈ ఫోన్ పై రూ.3850 వరకు క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఈజీ ఈఎంఐ స్కీమ్‌లో కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధర రూ.66,700 వరకు ఉంది. ఈ శాంసంగ్ ఫోన్‌లో 6.2 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్‌లో ఫోటోగ్రఫీ కోసం 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ55 5జీ

8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.42,999గా ఉంది. ఈ సేల్‌లో రూ.2250 బ్యాంక్ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ పై రూ.2150 వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో ఈ ఫోన్ ధర రూ.40,849 వరకు ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను కంపెనీ అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్.

శాంసంగ్ గెలాక్సీ ఏ35 5జీ

అమెజాన్ డీల్ ప్రకారం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.30,999. హెచ్‌డీఎఫ్‌సీ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు ఉపయోగించి ఫోన్ కొంటే రూ.3 వేల ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌పై రూ.1550 వరకు క్యాష్‌బ్యాక్‌ను కంపెనీ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఈ ఫోన్ ధరను రూ.29,250 వరకు తగ్గించుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ ఫోన్ 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ కెమెరాతో వస్తుంది. దీని డిస్‌ప్లే 6.6 అంగుళాలు. ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.