HP OmniBook: హెచ్పీ ఏఐ బేస్డ్ 2-ఇన్-1 ల్యాప్ టాప్ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ లాంచ్; ఇప్పుడు కొంటే రూ. 10 వేల బెనిఫిట్-hp omnibook ultra flip launched in india at rs 181999 check features availability and more ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hp Omnibook: హెచ్పీ ఏఐ బేస్డ్ 2-ఇన్-1 ల్యాప్ టాప్ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ లాంచ్; ఇప్పుడు కొంటే రూ. 10 వేల బెనిఫిట్

HP OmniBook: హెచ్పీ ఏఐ బేస్డ్ 2-ఇన్-1 ల్యాప్ టాప్ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ లాంచ్; ఇప్పుడు కొంటే రూ. 10 వేల బెనిఫిట్

Sudarshan V HT Telugu
Oct 22, 2024 07:20 PM IST

HP OmniBook: హెచ్ పీ ఇండియా తన తొలి ఏఐ ఆధారిత 2-ఇన్-1 ల్యాప్ టాప్ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ను భారత్ లో విడుదల చేసింది. ఇందులో ఇంటెల్ లూనార్ లేక్ ప్రాసెసర్ సెకనుకు 48 ట్రిలియన్ కార్యకలాపాలను నిర్వహించగల న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నాయి. దీని ధరను రూ. 181999 గా హెచ్పీ నిర్ణయించింది.

హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్
హెచ్పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ (HP )

HP OmniBook: హెచ్ పీ ఇండియా తన తొలి ఏఐ ఆధారిత 2-ఇన్-1 ల్యాప్ టాప్ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ ను భారత్ లో లాంచ్ చేసింది. హెచ్ పీ నుంచి వస్తున్న తొలి కృత్రిమ మేథ ఆధారిత ల్యాప్ టాప్ ఇది. దీని ధరను రూ. 181999 గా నిర్ణయించారు. ఇందులో ఇంటెల్ లూనార్ లేక్ ప్రాసెసర్స్, సెకనుకు 48 ట్రిలియన్ కార్యకలాపాలను నిర్వహించగల న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ (NPU) ఉన్నాయి.

హెచ్ పీ ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్: కీలక ఫీచర్లు

ఓమ్నీబుక్ అల్ట్రా ఫ్లిప్ 21 గంటల బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. ఇందులో 2.8కే ఓఎల్ఈడీ డిస్ ప్లే ఉంది. వినియోగదారులు దీనిని ల్యాప్టాప్ గా లేదా టాబ్లెట్ గా ఉపయోగించుకోవచ్చు. హెచ్పీ (HP) తన మొదటి వినియోగదారు-స్థాయి ఏఐ భద్రతా వ్యవస్థ అయిన హెచ్పీ వోల్ఫ్ సెక్యూరిటీని ఇందులో మొదటి సారి పొందుపర్చింది. ఇది కృత్రిమ మేధ సృష్టించిన బెదిరింపులు, సైబర్ దాడుల నుండి డివైజ్ ను, డేటాను రక్షిస్తుంది. ఈ ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్ ఫ్రీలాన్సర్ లు, కంటెంట్ క్రియేటర్ల లేటెస్ట్ డిమాండ్లను సులభంగా తీర్చగలదని హెచ్పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ పేర్కొన్నారు. మెరుగైన వర్చువల్ సహకారం కోసం ఈ పరికరంలో 9 మెగాపిక్సెల్ ఏఐ కెమెరా, పాలీ ఆడియో ఉన్నాయి. స్పాట్ర లైట్, బ్యాక్ గ్రౌండ్ బ్లర్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలతో పాలీ కెమెరా ప్రో గుర్తించదగిన ఫీచర్లను కలిగి ఉంది. HP AI కంపానియన్ కంటెంట్ విశ్లేషణ, PC ఆప్టిమైజేషన్ లో సహాయపడుతుంది. ఇంకా, ల్యాప్టాప్ మెరుగైన ఉత్పాదకత, సృజనాత్మక పనుల కోసం కోపైలట్ + పీసీతో ఇంటిగ్రేట్ అవుతుంది.

రూ. 10 వేల ప్రయోజనాలు

90 శాతం రీసైకిల్ చేసిన లోహాలు, 50 శాతం పోస్ట్-కన్స్యూమర్ రీసైకిల్ ప్లాస్టిక్ లను ఉపయోగించి హెచ్ పీ తన డివైజెస్ ను నిర్మిస్తుంది. ఈ ల్యాప్టాప్ క్లైమేట్+, ఎనర్జీ స్టార్ గుర్తింపులతో పాటు ఈపీఈటీ గోల్డ్ సర్టిఫికేషన్ ను సాధించింది. అక్టోబర్ 31, 2024 లోపు ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్ కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.9,999 విలువైన అడోబ్ ఫోటోషాప్ ఎలిమెంట్స్, ప్రీమియర్ ఎలిమెంట్స్ ఉచితంగా లభిస్తాయి. అదనంగా, హెచ్పీ బజాజ్ ఫైనాన్స్ ద్వారా 18 నెలల నో-కాస్ట్ ఇఎంఐ ఎంపికను అందిస్తుంది.

హెచ్పి ఓమ్నిబుక్ అల్ట్రా ఫ్లిప్: ధర, లభ్యత

ఫ్రీలాన్సర్లు, కంటెంట్ క్రియేటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ల్యాప్టాప్ ప్రారంభ ధరను రూ.1,81,999గా నిర్ణయించారు. ఎక్లిప్స్ గ్రే, అట్మాస్ఫియరిక్ బ్లూ రంగుల్లో అల్ట్రా 7 మోడల్ లభిస్తుంది. అట్మాస్ఫియరిక్ బ్లూ రంగులో లభించే అల్ట్రా 9 మోడల్ ధర రూ.1,91,999 గా ఉంటుంది. వినియోగదారులు హెచ్పీ ఆన్లైన్ స్టోర్, అమెజాన్ (Amazon) , ఫ్లిప్కార్ట్, వివిధ ఆఫ్లైన్ రిటైలర్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.

Whats_app_banner