Complaint : బ్యాంకులో మీ సమస్యను పట్టించుకోవడం లేదా? ఇలా వారిపై కంప్లైంట్ చేయండి-how to file a complaint against bank employee if they behave arbitrarily ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Complaint : బ్యాంకులో మీ సమస్యను పట్టించుకోవడం లేదా? ఇలా వారిపై కంప్లైంట్ చేయండి

Complaint : బ్యాంకులో మీ సమస్యను పట్టించుకోవడం లేదా? ఇలా వారిపై కంప్లైంట్ చేయండి

Anand Sai HT Telugu
Oct 01, 2024 07:00 PM IST

Complaint On Bank Employee : చాలా మంది బ్యాంకుకు వెళ్లినప్పుడు ఉద్యోగి ప్రవర్తనపై విసుగు చెందుతారు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా.. సమస్యను పట్టించుకోవడం లేదని అంటుంటారు. కానీ మీ హక్కులను మీరు తెలుసుకోవాలి. అలాంటివారిపై కస్టమర్ నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా చాలామంది ప్రజలు బ్యాంకుకు వెళ్లి సమస్య చెప్పినా పట్టించుకోవడం లేదని అక్కడ, ఇక్కడ తిరుగుతూ లేదా బ్యాంకుల్లో తమ పని కోసం వేచి ఉండటం చూడవచ్చు. కానీ బ్యాంకులో ఉన్న ఉద్యోగి మీ పనిని చేయడానికి ఇష్టపడకపోతే లేదా మిమ్మల్ని అనవసరంగా వేచి ఉండేలా చేస్తే మీరు దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.

మీరు ఏదో పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న బ్యాంకు ఉద్యోగులు మీ పనిని చేయడానికి ఇష్టపడకపోవడమో, లేదా మిమ్మల్ని అనవసరంగా నిరీక్షించేలా చేయడం మీకు ఎప్పుడైనా జరిగిందా? భోజనం తర్వాత రమ్మని మీకు చెప్పడం, తీరా టైమ్‌కి వెళ్తే సీటులో వారు కనిపించకపోవడం, ఇలా మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీకు ఇలా జరిగితే మీరు బ్యాంకు ఉద్యోగిపై ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంక్ కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం RBI టోల్ ఫ్రీ నంబర్ 14448 ఉంది. దీనికి కాల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

డ్యూటీ సమయంలో మీ పనిని వాయిదా వేసే ఉద్యోగుల నిర్లక్ష్యంపై తక్షణ చర్యలు తీసుకోవచ్చని తెలుసుకోవాలి. మీరు మీ హక్కులను, వాటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ బ్యాంకు ఖాతాదారులకు అనేక హక్కులను ఇచ్చింది. మీరు అటువంటి సమస్యల గురించి ఫిర్యాదు చేసేందుకు అనేక విధాలు ఉన్నాయి.

తమ హక్కులపై అవగాహన లేకపోవడంతో కస్టమర్లు కొంతమంది ఉద్యోగుల అజాగ్రత్త ప్రవర్తనకు బాధితులుగా మారుతున్నారు. గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి వస్తుంది. కానీ భవిష్యత్తులో మీకు అలాంటి ఘటనలు ఎదురైతే మీరు ఆ ఉద్యోగి గురించి నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు. సమస్యకు పరిష్కారం పొందవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ప్రశ్నించవచ్చు. ఎవరైనా బ్యాంకు ఉద్యోగి మీ పని చేయడంలో ఆలస్యం చేస్తే ముందుగా బ్యాంక్ మేనేజర్ లేదా నోడల్ అధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయండి.

కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి దాదాపు ప్రతి బ్యాంకుకు ఫిర్యాదుల పరిష్కార ఫోరమ్ ఉంటుంది. దీని ద్వారా అందిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటారు. దీని కోసం మీరు కస్టమర్‌గా ఉన్న బ్యాంకు గ్రీవెన్స్ రిడ్రెసల్ నంబర్ తీసుకొని ఫిర్యాదు చేయవచ్చు. అంతే కాకుండా బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా బ్యాంకు ఆన్‌లైన్ పోర్టల్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. నేరుగా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కి ఫిర్యాదు చేయవచ్చు .

ఇలా కంప్లైంట్ చేయండి

మీరు మీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో పంపవచ్చు. ఫిర్యాదు చేయడానికి, మీరు https://cms.rbi.org.in వెబ్‌సైట్‌కి లాగిన్ చేయాలి.

తర్వాత హోమ్‌పేజీ ఓపెన్‌ కాగానే అక్కడ ఇచ్చిన File A Complaint ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

CRPC@rbi.org.inకు ఇమెయిల్ పంపడం ద్వారా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్‌కు కూడా ఫిర్యాదు చేయవచ్చు .

బ్యాంక్ కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఆర్బీఐ టోల్ ఫ్రీ నంబర్ 14448 కాల్ చేయడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు.

టాపిక్