How to claim NPS death benefits: NPS డెత్ బెనిఫిట్స్ పొందడం ఎలా?-how to claim nps death benefits upon the sudden demise of a subscriber ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  How To Claim Nps Death Benefits: Nps డెత్ బెనిఫిట్స్ పొందడం ఎలా?

How to claim NPS death benefits: NPS డెత్ బెనిఫిట్స్ పొందడం ఎలా?

HT Telugu Desk HT Telugu
Jan 06, 2023 08:05 PM IST

How to claim NPS death benefits: నేషనల్ పెన్షన్ సిస్టమ్(National Pension System (NPS) లో చందాదారుడిగా ఉన్న వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ వ్యక్తి నామినీ కానీ, చట్టబద్ధ వారసులు కానీ మరణానంతర ప్రయోజనాలను పొందే విషయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటుంటారు. వారి కోసమే ఈ ఎన్పీఎస్ డెత్ బెనిఫిట్స్ పొందడానికి అవసరమైన సమగ్ర వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Photo: iStock)

How to claim NPS death benefits: నేషనల్ పెన్షన్ సిస్టమ్(NPS)ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(Pension Fund Regulatory and Development Authority PFRDA) నిర్వహిస్తుంది. ఈ ఎన్పీఎస్(NPS) ఒక స్వచ్చంద రిటైర్ మెంట్ ప్రొగ్రామ్. ఇది మార్కెట్ బేస్డ్ రిటర్న్స్ ను అందిస్తుంది. ఇందులో చేరిన వారికి రిటైర్ మెంట్ అనంతరం పెన్షన్ తో పాటు, మరణం సంభవిస్తే నామినీ లేదా చట్టబద్ధ వారసులకు పెద్ద మొత్తంలో డబ్బు లభిస్తుంది. ఇందులో చందాదారులు స్వయంగా ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాలను, రిటైర్ మెంట్ ఫండ్ ను రూపొందించుకోవచ్చు.

How to claim NPS death benefits: డెత్ బెనిఫిట్స్ పొందడం ఎలా?

  • ప్రభుత్వేతర రంగంలో ఉన్న ఎన్ పీఎస్ చందాదారుడు మరణిస్తే, ఆ వ్యక్తి నామినీ కానీ, చట్టబద్ధ వారసులు(legal heir) కానీ డెత్ బెనిఫిట్స్ పొందవచ్చు.
  • డెత్ బెనిఫిట్స్ లో మొత్తం డబ్బును ఒకేసారి పొందవచ్చు. లేదా పెన్షన్ పొందడానికి వీలుగా యాన్యుటీని కొనుగోలు చేసుకోవచ్చు.
  • నామినీ లేదా చట్టబద్ధ వారసులు ముందుగా చనిపోయిన చందాదారుడి డెత్ సర్టిఫికెట్ ను సంబంధిత అధికారుల నుంచి తీసుకోవాలి.
  • ఎన్పీఎస్(NPS) చందాదారుడు Protean CRA కి చెందిన eNPS పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ఉంటే, అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి విత్ డ్రాయల్ ఫామ్ ను ఫిల్ చేసి, ఎన్పీఎస్ ట్రస్ట్ (NPS Trust) కు సబ్మిట్ చేయాలి.
  • విత్ డ్రాయల్ ఫామ్ తో పాటు డెత్ సర్టిఫికెట్ ను, నామినీ లేని పక్షంలో చట్టబద్ధంగా తామే వారసులమని నిర్ధారించే పత్రాలను, కేవైసీ డాక్యుమెంట్స్ ను, బ్యాంక్ ఖాతా వివరాలను అందించాలి. www.npscra.nsdl.co.in వెబ్ సైట్ నుంచి విత్ డ్రాయల్ ఫామ్ ను డౌల్ లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫామ్ లోనే అవసరమైన డాక్యుమెంట్ల లిస్ట్ కూడా ఉంటుంది.
  • అవసరమైన వెరిఫికేషన్ పూర్తయిన తరువాత డెత్ బెనిఫిట్స్ గా అందే మొత్తం నామినీ లేదా చట్టబద్ధ వారసుల బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతుంది.

Whats_app_banner