How to open NPS account : ఎన్​పీఎస్​ ఖాతా ఓపెన్​ చేయడం ఎలా?-how to open an nps account both online and offline check all the details in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Open An Nps Account Both Online And Offline Check All The Details In Telugu

How to open NPS account : ఎన్​పీఎస్​ ఖాతా ఓపెన్​ చేయడం ఎలా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 17, 2022 11:31 AM IST

How to Open NPS Account : ఎన్​పీఎస్​ ఖాతా తెరవాలని చూస్తున్నారా? మీకు ఆ ప్రాసెస్​ తెలియదా? అయితే ఇది మీ కోసమే..

ఎన్​పీఎస్​ ఖాతా ఓపెన్​ చేయడం ఎలా?
ఎన్​పీఎస్​ ఖాతా ఓపెన్​ చేయడం ఎలా?

How to Open NPS Account : ప్రభుత్వం మద్దతున్న ఎన్​పీఎస్(నేషనల్​ పెన్షన్​ స్కీమ్​)కు ఇటీవలి కాలంలో ఆదరణ పెరుగుతోంది. ఈక్విటీ, డెట్​లో పెట్టుబడుల కారణంగా దీర్ఘకాలంలో ఇందులో మంచి రిటర్నులు వస్తాయని అందరు భావిస్తున్నారు. ఈ క్రమంలో.. ఎన్​పీఎస్​ ఖాతాను ఓపెన్​ చేయడం ఎలా? అన్న వివరాలను ఓసారి తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

ఎన్​పీఎస్​ అకౌంట్​..

ఎన్​పీఎస్​ ఖాతా రెండు రకాలుగా ఉంటుంది.

ఎన్​పీఎస్​ టయర్​-1 అకౌంట్​:- ఇందులో పెట్టుబడులతో సెక్షన్​ 80సీ కింద ట్యాక్స్​ బెనిఫిట్స్​ లభిస్తాయి. సాధారణంగా ఎన్​పీఎస్​ అకౌంట్​ అంటే రూ. 1.50లక్షల వరకు బెనిఫిట్స్​ ఉంటాయి. ఈ తరహా అకౌంట్​ను తీసుకుంటే.. అదనంగా మరో రూ. 50వేల వరకు ట్యాక్స్​ బెనిఫిట్​ ఉంటుంది. కానీ విత్​డ్రా సమయంలో పలు నిబంధనలు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

National Pension Scheme account open in Telugu : ఎన్​పీఎస్​ టయర్​- 2 అకౌంట్​:- ఇది ఆప్షనల్​ రిటైర్మెంట్​/ ఇన్​వెస్ట్​మెంట్​ అకౌంట్​. టయర్​ 1 అకౌంట్​ ఉన్న ఎన్​పీఎస్​ సబ్​స్క్రైబర్లకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎలాంటి ట్యాక్స్​ బెనిఫిట్స్​ ఉండవు. ఇందులో ఎలాంటి విత్​డ్రా నిబంధనలు ఉండవు.

ఎన్​పీఎస్​ ఖాతాను తెరవడం ఎలా?

ఎన్​పీఎస్​ ఖాతాను తెరవడం కోస రెండు మార్గాలు ఉన్నాయి. 1. ఆన్​లైన్​ 2. ఆఫ్​లైన్​.

ఆన్​లైన్​ ప్రక్రియ..

స్టెప్​ 1:- ముందుగా PFRDA అఫీషియల్​ వెబ్​సైట్​కు వెళ్లాలి.

స్టెప్​ 2:- రిజిస్ట్రేషన్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి. రిజిస్టర్​ విత్​ ఆధార్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి.

స్టెప్​ 3:- ఆధార్​ కార్డుతో లింక్​ అయిన ఫోన్​ నెంబర్​కి ఓటీపీ వెళుతుంది.

స్టెప్​ 4:- ఓటీపీతో పాటు మీ వ్యక్తిగత సమాచారం, నామినీ వివరాలు, బ్యాంక్​ వివరాలను నింపాల్సి ఉంటుంది.

Open NPS account in Telugu : స్టెప్​ 5:- ఇచ్చిన వివరాలను మళ్లీ చెక్​ చేసుకుని సబ్మీట్​ చేయాలి. ఆ తర్వాత మీకు పీఆర్​ఏఎన్​(పర్మనెంట్​ రిటైర్మెంట్​ అలాట్​మెంట్​ నెంబర్​) అలాట్​ అవుతుంది.

స్టెప్​ 6:- ఈ- సిగ్నేచర్​ ఆప్షన్​ మీద క్లిక్​ చేయాలి. మీ మొబైల్​ నెంబర్​కు ఓటీపీ వెళుతుంది.

స్టెప్​ 7:- ఓటీపీని ఎంటర్​ చేసి, సిగ్నేచర్​ను వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేమెంట్​ చేయాలి.

NPS withdrawal process పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఆఫ్​లైన్​ ప్రక్రియ..

స్టెప్​ 1:- ఆఫ్​లైన్​లో ఎన్​పీఎస్​ ఖాతాను ఓపెన్​ చేసేందుకు సమీపంలోని పీఓపీఎస్​(పాయింట్​ ఆఫ్​ ప్రెసెన్స్​) కార్యాలయానికి వెళ్లాలి. (ఎన్​పీఎస్​ స్కీమ్​ కోసం కస్టమర్లకు సేవలందేంచేందుకు కొన్ని బ్యాంక్​లు, ఆర్థిక వ్యవస్థలను ప్రభుత్వం పీఎఫ్​ఆర్​డీఏ ఏర్పాటు చేసింది. వాటిని పీఓపీఎస్​ అని పిలుస్తారు.)

స్టెప్​ 2:- అక్కడి నుంచి రిజిస్ట్రేషన్​ ఫామ్​ను తీసుకోవాలి. వివరాలను ఫిల్​ చేసి, కేవైసీ డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ఎన్​పీఎస్​ అకౌంట్​లోకి లాగిన్​ అవ్వడం ఎలా?

How to login to your NPS account for the first time : ఎన్​ఎస్​డీఎల్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి ఎన్​పీఎస్​ అకౌంట్​లోకి లాగిన అవ్వొచ్చు. హోం పేజీలో లాగిన్​ మెన్యూ వద్ద ఎన్​పీఎస్​ లింక్​ ఉంటుంది. దాని మీద క్లిక్​ చేస్తే ఎన్​పీఎస్​కు ప్రత్యేకంగా ఓ పేజ్​ ఓపెన్​ అవుతుంది. మీ పీఆర్​ఏఎన్​, పాస్​వర్డ్​ను టైప్​ చేసి అకౌంట్​లోకి లాగిన అవ్వాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం