Oppo Reno 8 5G: భారీ డిస్కౌంట్ తో ఒప్పొ రెనో 8 5జీ ఫోన్..-hot deal grab the oppo reno 8 5g at this amazing new price ,బిజినెస్ న్యూస్
Telugu News  /  Business  /  Hot Deal! Grab The Oppo Reno 8 5g At This Amazing New Price

Oppo Reno 8 5G: భారీ డిస్కౌంట్ తో ఒప్పొ రెనో 8 5జీ ఫోన్..

HT Telugu Desk HT Telugu
Jun 24, 2023 05:13 PM IST

Oppo Reno 8 5G: మిడ్ రేంజ్ ధరలో, అన్ని ఫీచర్స్ తో, 5 జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేసే కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఈ ఆఫర్ మీ కోసమే..

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Amritanshu / HT Tech)

Oppo Reno 8 5G: ఒప్పొ నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ స్మార్ట్ ఫోన్స్ లో రెనొ 8 5 జీ ఒకటి. ఈ స్మార్ట్ ఫోన్ ను జులై 2022 లో లాంచ్ చేశారు. ఇందులో 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేట్ తో 6.4 ఇంచ్ అమొలెడ్ డిస్ ప్లే ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇందులో వెనుకవైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ మోనో క్రోమ్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు, సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా ఉంది. అలాగే, ఇందులో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

ట్రెండింగ్ వార్తలు

మిడ్ రేంజ్ లో బెస్ట్ ఫోన్

అడ్వాన్స్ డ్ ఫీచర్స్ తో, 5జీ నెట్వర్క్ తో, పవర్ ఫుల్ ప్రాసెసర్ తో, భారీ బ్యాటరీతో, మంచి కెమెరా సెటప్ తో లభించే ఈ స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలోనే లభిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ లో లభిస్తోంది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై రూ. 29 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. అంటే, మీ వద్ద ఉన్న వర్కింగ్ కండిషన్ లో ఉన్న స్మార్ట్ ఫోన్ ను ఎక్స్చేంజ్ చేస్తే మీకు, మీరు కొనుగోలు చేస్తున్న ఒప్పొ రెనో 8 5 జీ ఫోన్ పై రూ. 29 వేల వరకు తగ్గింపు ఉంటుంది. అయితే, ఈ మీరు ఎక్స్చేంజ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్ ను బట్టి ఈ ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేస్తే రూ. 1250 తక్షణ తగ్గింపు వర్తిస్తుంది. కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది.

WhatsApp channel