Honda offers: హోండా కార్ల కొనుగోలుపై మాన్ సూన్ డీల్స్, సర్ ప్రైజ్ గిఫ్ట్స్-honda offers monsoon deals and surprise gifts on car purchase check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Honda Offers: హోండా కార్ల కొనుగోలుపై మాన్ సూన్ డీల్స్, సర్ ప్రైజ్ గిఫ్ట్స్

Honda offers: హోండా కార్ల కొనుగోలుపై మాన్ సూన్ డీల్స్, సర్ ప్రైజ్ గిఫ్ట్స్

HT Telugu Desk HT Telugu
Jul 02, 2024 09:52 PM IST

ఈ వర్షాకాలం సీజన్ లో కార్ల అమ్మకాలను పెంచే దిశగా హోండా కార్స్ కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ 'హోండా మ్యాజికల్ మాన్ సూన్' క్యాంపెయిన్ లో ఈ వర్షాకాలంలో హోండా కారును కొనుగోలు చేసిన వినియోగదారులకు మాన్ సూన్ డీల్స్, సర్ ప్రైజ్ గిఫ్ట్స్ ఆఫర్ చేస్తోంది.

హోండా కార్ల కొనుగోలుపై మాన్ సూన్ డీల్స్,  సర్ ప్రైజ్ గిఫ్ట్స్
హోండా కార్ల కొనుగోలుపై మాన్ సూన్ డీల్స్, సర్ ప్రైజ్ గిఫ్ట్స్

Honda offers monsoon deals: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) ఈ వర్షాకాల సీజన్ ను పురస్కరించుకుని 'హోండా మ్యాజికల్ మాన్సూన్' ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించింది. జూలై 1 నుంచి 31 వరకు జరిగే ఈ నెల రోజుల ప్రమోషన్ లో భాగంగా ఏదైనా హోండా కారు కొనుగోలు చేసిన వినియోగదారులకు అనేక ప్రయోజనాలు, సర్ ప్రైజ్ బహుమతులను అందిస్తోంది.

దేశవ్యాప్తంగా..

దేశవ్యాప్తంగా అన్ని అధీకృత హోండా (Honda cars) డీలర్ షిప్ ల్లో ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. ఈ క్యాంపెయిన్ వర్షాకాలంలో కార్ల కొనుగోలును మరింత లాభదాయకంగా మార్చాలని హోండా కార్స్ (Honda cars) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మాన్సూస్ ఆఫర్స్ అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఇ:హెచ్ఇవి హైబ్రిడ్ వేరియంట్ సహా హోండా లైనప్ లోని అన్ని కార్లకు వర్తిస్తాయి.

టెస్ట్ డ్రైవ్ తో కూడా గిఫ్ట్స్

ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను వినియోగదారులు అన్ని హోండా కార్లపై పొందవచ్చు. అదనంగా, రూ .75,000 వరకు విలువైన బహుమతులను పొందవచ్చు. జూలై 1 నుంచి జూలై 31 వరకు ప్రచార కాలంలో నిర్వహించే టెస్ట్ డ్రైవ్ ల్లో కూడా ఆశ్చర్యకరమైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది.

తగ్గిన హోండా కార్స్ సేల్స్

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL) జూన్ 2024 లో ఆశించిన సేల్స్ సాధించలేకపోయింది. దేశీయ అమ్మకాలు 2023 జూన్ లో విక్రయించిన 5,080 యూనిట్లతో పోలిస్తే 5 శాతం తగ్గి 4,804 యూనిట్లకు పరిమితమయ్యాయి. మే 2024 లో కూడా అంతకుముందు సంవత్సరం మే నెల అమ్మకాల కన్నా తక్కువే నమోదయ్యాయి. మే నెలలో దేశీయ అమ్మకాలు 4,822 యూనిట్లుగా ఉన్నాయి. అయితే, ఎగుమతుల్లో హోండా కార్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. 2023 జూన్ లో 2,112 యూనిట్ల ను ఎగుమతి చేయగా, 2024 జూన్ లో 4,972 యూనిట్లను ఎగుమతి చేసింది. అంటే దాదాపు 135 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతర్జాతీయ ఉనికిని విస్తరించడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాలకు ఇది సానుకూల సంకేతం. నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే దేశీయ అమ్మకాలు, ఎగుమతులు స్వల్పంగా క్షీణించాయి. 2024 మేలో 6,521 యూనిట్లను ఎగుమతి చేయగా, దేశీయ అమ్మకాలు 4,822 యూనిట్లుగా ఉన్నాయి.

Whats_app_banner