Honda EM1 e electric Scooter unveiled: స్వాపబుల్ బ్యాటరీతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించిన హోండా-honda em1 e electric scooter unveiled with swappable battery know full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Honda Em1 E Electric Scooter Unveiled With Swappable Battery Know Full Details Here

Honda EM1 e electric Scooter unveiled: స్వాపబుల్ బ్యాటరీతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆవిష్కరించిన హోండా

HT Telugu Desk HT Telugu
Nov 09, 2022 03:40 PM IST

Honda EM1 e Electric Scooter: Honda EM1 e electric Scooter: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‍ను హోండా ప్రపంచానికి పరిచయం చేసింది. హోండా ఈఎం1 ఈ మోడల్‍ను EICMA 2022లో ఆవిష్కరించింది.

Honda EM1 e Electric Scooter: కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన హోండా
Honda EM1 e Electric Scooter: కంపెనీ నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన హోండా

Honda EM1 e Electric Scooter: హోండా నుంచి తొలిసారిగా ఈఎం1 ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ రాబోతోంది. అయితే ప్రస్తుతం ఇది యురోపియన్ మార్కెట్ కోసం లాంఛ్ చేయబోతోంది. 2023 వేసవిలోగా ఇది అక్కడి మార్కెట్లలో అందుబాటులోకి రాబోతోంది. 2025 నాటికి హోండా భారత, అంతర్జాతీయ మార్కెట్లలోకి 10 ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ మోడల్స్ తీసుకురానుంది. 2040 నాటికి మోటార్ సైకిల్ శ్రేణిలో కార్బన్ న్యూట్రాలిటీ సాధించే లక్ష్యంలో భాగంగా హోండా వేస్తున్న తొలి అడుగు ఇది. స్కూటర్లలో హోండా ద్విచక్ర వాహనం యాక్టివా దేశంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

తొలుత యూరప్ మార్కెట్లలో ఈ ఈఎం1 ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ లాంచ్ చేయబోతోంది. భారత మార్కెట్లోకి ఎప్పుడు తేనుందో ఇంకా వెల్లడించలేదు. హోండా ఈఎం1 ఈ స్కూటర్ ను ఈఐసీఎంఏ 2022 (EICMA 2022) లో ప్రదర్శించింది. Honda EM1 e పూర్తి వివరాలు ఇవే.

ఈ మోడల్ పేరులో EM అంటే ఎలక్ట్రిక్ మోపెడ్. పట్టణాల్లో సులువుగా ప్రయాణించేలా, యువత లక్ష్యంగా ఈ మోడల్‍ను తీసుకొస్తున్నట్టు హోండా పేర్కొంది. కాంపాక్ట్, ఫ్లాట్ ఫ్లోర్ గా స్మూత్ స్టైలిష్ లుక్‍తో EM1 e స్కూటర్ వస్తోంది. మిలిమల్ డిజైన్‍తోనే హోండా ఈ స్కూటర్ ను రూపొందించింది. టర్న్ ఇండికేటర్లు హ్యాండిల్ బార్ పైనే ఉన్నాయి. ఫ్రంట్ ఆఫ్రాన్‍పై ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ యూనిట్‍ను హోండా పొందుపరిచింది. వెనుక ఫుట్‍పెగ్స్ కూడా స్కూటర్ బాడీకి సూటయ్యేలా ఉన్నాయి.

Honda EM1 e electric Scooter: స్వాపబుల్ బ్యాటరీతో..

నగరాల్లో తక్కువ దూరాలు ప్రయాణించే వారి కోసమే ఈ EM1 e ఎలక్ట్రిక్ స్కూటర్ ను హోండా రూపొందించింది. ఎందుకంటే ఈ స్కూటర్ ఫుల్ బ్యాటరీ చార్జ్ పై 40 కిలోమీటర్ల రేంజ్‍ను మాత్రమే ఇస్తుంది. విభిన్న ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ లెవెల్స్, వైబ్రేషన్స్ ఉన్నా ప్రభావం పడకుండా ఈ మొబైల్ పవర్ ప్యాక్ (MPP) బ్యాటరీని హోండా తయారు చేసింది. ఇది స్వాపబుల్ బ్యాటరీ. అంటే స్కూటర్ నుంచి ఈ బ్యాటరీని సులువుగా వేరు చేసి ఇంట్లో చార్జ్ చేసుకోవచ్చు.

Honda EM1 e electric Scooter: లాంచ్ వివరాలు

ముందుగా, వచ్చే ఏడాది వేసవిలో యూరప్ మార్కెట్‍లో Honda EM1 e ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వస్తుంది. ఇండియాలో ఈ మోడల్ లాంచ్ గురించి హోండా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. మరి హోండా ఈఎం1 ఈ స్కూటర్ భారత్‍కు వస్తుందా లేదా చూడాలి.

హోండా సీఎల్ 500ను కూడా EICMA 2022లో హోండా ఆవిష్కరించింది. 500cc ఇంజిన్‍తో అదిరిపోయే డిజైన్‍తో ఈ బైక్ ఉంది.

WhatsApp channel