Hero Karizma launch : మార్కెట్లోకి రీ- ఎంట్రీ ఇస్తున్న హీరో కరిష్మా..!
Hero Karizma launch : హీరో కరిష్మా.. ఇండియా మార్కెట్లో రీ ఎంట్రీ ఇవ్వనుంది! 2019లో ఇది డిస్కంటిన్యూ అయ్యింది.
New Hero Karizma launch : కరిష్మా మోడల్‌కు లేటెస్ట్ వర్షెన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది దేశీయ దిగ్గజ బైక్స్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్. ఈ ఏడాది రెండో భాగంలో హీరో కరిష్మా ఇండియా మార్కెట్లోకి రీ- ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఆల్ న్యూ హీరో కరిష్మా వచ్చేస్తోంది..!
హీరో మోటోకార్ప్ బైక్స్ పోర్ట్‌ఫోలియోలో ఒకప్పుడు ది బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉండేది ఈ కరిష్మా. అనంతర కాలంలో పోటీని తట్టుకోలేక డీలాపడింది. విక్రయాలు గణనీయంగా పతనమయ్యాయి. చివరికి.. ఈ మోడల్‌ను 2019లో డిస్కంటిన్యూ చేసింది హీరో మోటోకార్ప్.
Hero Karizma 2023 : ప్రస్తుతం ఇండియాలో ఆటోమొబైల్ మార్కెట్లో పరిస్థితులు మారుతున్నాయని సంస్థ భావిస్తోంది. కరిష్మా రీ- లాంచ్ చేసే టైమ్ వచ్చిందని ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ మోడల్‌కు ఆల్- న్యూ 210 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఇచ్చి సరికొత్తగా లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు వెలువడ్డాయి.
2003లో తొలిసారి కరిష్మా మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది హీరో మోటోకార్ప్. స్పోర్ట్స్- టూరర్ సెగ్మెంట్లో తొలి బైక్ ఇదే. అప్పటివరకు ఉన్న 200సీసీ లిమిట్‌ను దాటిన తొలి బైక్ కూడా ఇదే! ఇందులో 223సీసీ, ఎస్ఓహెచ్సీ, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ ఉండేది.
హీరో కరిష్మా ఫీచర్స్ ఇవే..!
Hero Karizma 210cc bike : హీరో కరిష్మా డిజైన్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. అయితే.. ఇందులో సెమీ- ఫేర్డ్ డిజైన్, ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్, రైజ్డ్ విండ్‌స్క్రీన్, స్ప్లిట్ టైప్ సీట్స్, స్టబీ ఎక్సాస్ట్, టేపరింగ్ రేర్ ఎండ్ వంటివి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టివిటీ ఆప్షన్స్, డిజైనర్ ఆలాయ్ వీల్స్ వంటివి ఉంటాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక సేఫ్టీ విషయానికొస్తే.. హీరో కరిష్మా ఫ్రెంట్, రేర్ వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్, డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ వంటి బ్రేకింగ్ సెటప్ రావొచ్చు. సస్పెన్షన్ కోసం ఇన్వర్టెడ్ ఫోర్క్స్, ప్రీలోడెడ్ అడ్జస్టెబుల్ మోనో షాక్ యూనిట్స్ వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
హీరో కరిష్మా ధర..
Latest Hero Karizma news : ఈ హీరో కరిష్మా మోడల్ ప్రస్తుతానికి టెస్టింగ్ దశలోనే ఉంది. అందుకే దీనిపై సరైన సమాచారం మార్కెట్లో అందుబాటులో లేదు. ధర, ఫీచర్స్ వంటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే.. హీరో మోటోకార్ప్ గత లాంచ్‌లను పరిశీలిస్తే.. ఈ హీరో కరిష్మా ఎక్స్‌షోరూం ధర రూ. 1.06లక్షలుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం