Top bikes under 3 Lakhs : రూ. 3లక్షల బడ్జెట్​లో.. వాల్యూ ఫర్​ మనీ బైక్స్​ ఇవే..!-here is the list of top and best bikes under 3 lakh in india check full details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Top Bikes Under 3 Lakhs : రూ. 3లక్షల బడ్జెట్​లో.. వాల్యూ ఫర్​ మనీ బైక్స్​ ఇవే..!

Top bikes under 3 Lakhs : రూ. 3లక్షల బడ్జెట్​లో.. వాల్యూ ఫర్​ మనీ బైక్స్​ ఇవే..!

Sharath Chitturi HT Telugu
Apr 03, 2023 06:59 AM IST

Top bikes under 3 Lakhs : కొత్తగాా ఓ బైక్​ తీసుకుందామని చూస్తున్నారా? మీ బడ్జెట్​ రూ. 3లక్షలలోపు ఉంటుందా? అయితే.. మీకోసమే ఈ బెస్ట్​ బైక్స్​ లిస్ట్​..

రూ. 3లక్షల బడ్జెట్​లో.. వాల్యూ ఫర్​ మనీ బైక్స్​ ఇవే..!
రూ. 3లక్షల బడ్జెట్​లో.. వాల్యూ ఫర్​ మనీ బైక్స్​ ఇవే..!

Top bikes under 3 Lakhs in India : దేశంలో గత కొన్నేళ్లుగా మోటార్​సైకిళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అలా అని డిమాండ్​ మాత్రం తగ్గలేదు! ధరలు పెరిగినా.. చాలా మంది 2 వీలర్​ను కొంటున్నారు. డిమాండ్​కు తగ్గట్టుగా.. కొత్త కొత్త మోడల్స్​ను తీసుకొస్తున్నాయి ద్విచక్ర వాహన తయారీ సంస్థలు. ఈ నేపథ్యంలో దేశంలో రూ.3లక్షలలోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్​ అండ్​ వాల్యూ ఫర్​ మనీ బైక్​లను ఓసారి చూద్దాము..

కేటీఎం 390 డ్యూక్​..

KTM 390 Duke on road price Hyderabad : 2017లో ఈ బైక్​ ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఇందులో స్వల్ప మార్పులే జరిగాయి. కానీ మంచి పర్ఫార్మెన్స్​ ఇచ్చే బైక్​ని కొనాలని మీరు భావిస్తుంటే.. ఈ కేటీఎం 390 డ్యూక్​ మీ లిస్ట్​లో ఉండాల్సిందే! ఇందులో 373సీసీ ఇంజిన్​ ఉంటుంది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.96లక్షలు.

టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​ 310

TVS Apache RR 310 price : మంచి స్పోర్టీ లుక్​ ఇచ్చే బైక్​ కొనాలని చూస్తుంటే.. ఈ టీవీఎస్​ అపాచీ ఆర్​ఆర్​ 310ను చూడొచ్చు. ఏళ్లుగా దీనికి అప్డేట్స్​ లభిస్తూనే ఉన్నాయి. ఫలితంగా పర్ఫార్మెన్స్​తో పాటు సేఫ్టీ ఫీచర్స్​ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఇందులో 312.2సీసీ ఇంజిన్​ ఉంటుంది. 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ దీని సొంతం. 11 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీతో.. ఈ బైక్​ 30కేఎంపీహెచ్​ మైలేజ్​ని ఇస్తోంది. ఈ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 2.72లక్షలు.

హోండా సీబీ300ఆర్.​.

Honda CB300R specifications : ఇందులో 286సీసీ సింగిల్​ సిలిండర్​ ఇంజిన్​ ఉంటుంది. దీని కర్బ్​ వెయిట్​ 147కేజీలు. డ్యూక్​ కన్నా 24కేజీలు తక్కువ. ఫలితంగా ఈ బైక్​ లైట్​ వెయిట్​గా అనిపిస్తుంది. డ్రైవ్​ చేస్తుంటే అద్భుతమైన ఫీల్​ వస్తుంది. 0-100 కేపీహెచ్​ను కేవలం 6.58 సెకన్లలో అందుకోగలదు. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.77లక్షలు.

సుజుకీ వీ- స్ట్రామ్​ ఎస్​ఎక్స్​..

Suzuki V Strom SX on road price Hyderabad : సుదూర ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్​ చేయడం మీకు అలవాటా? ట్రావెలింగ్​ మీ హాబీనా? అయితే ఈ సుజుకీ వీ స్ట్రామ్​ ఎస్​ఎక్స్​ మీ లిస్ట్​లో ఉండాల్సిందే! ఇందులో మంచి కంఫర్ట్​ లభిస్తుంది. ఇందులో 249సీసీ ఇంజిన్​ ఉంటుంది. 12 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీతో 35కేఎంపీహెచ్​ మైలేజ్​ ఇస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​ గేర్​ బాక్స్​ దీని సొంతం. దీని ఎక్స్​షోరూం ధర రూ. 2.12లక్షలు.

రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350..

Royal Enfield Classic 350 price : రాయల్​ ఎన్​ఫీల్డ్​ మోడల్​ లేకపోతే.. అసలు ఎలాంటి బైక్​ లిస్ట్​ అయినా అసంపూర్ణంగానే ఉంటుంది! ఇక రూ. 1.90లక్షలు- రూ. 2.21లక్షల ఎక్స్​షోరూం ప్రైజ్​తో అందుబాటులో ఉన్న రాయల్​ ఎన్​ఫీల్డ్​ క్లాసిక్​ 350కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ఈ బైక్​లో రైడ్​.. చాలా బాగుంటుంది. ఇందులో 349సీసీ ఇంజిన్​ ఉంటుంది. 5 స్పీడ్​ మేన్యువల్​ గేర్​బాక్స్​ దీని సొంతం. 13 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ ఉన్న ఈ బైక్​.. 35 కేఎంపీహెచ్​ మైలేజ్​ని ఇస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం