TVS Apache RTR 310 : కేటీఎం 390 డ్యూక్‌కు పోటీగా.. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310- త్వరలోనే లాంచ్!
2023 TVS Apache RTR 310 : టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
2023 TVS Apache RTR 310 : దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టీవీఎస్ మోటార్.. అపాచీ ఆర్టీఆర్ 310ని ఇండియాలో లాంచ్ చేసేందుకు కసరత్తులు చేస్తోంది. త్వరలోనే ఈ బైక్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ బైక్ డిజైన్.. 2014 ఆటోఎక్స్పోలో సంస్థ ప్రదర్శించిన డ్రాకెన్ కాన్సెప్ట్‌ను పోలి ఉండనుంది. ఇక లాంచ్ అనంతరం.. ఈ స్ట్రీట్‌ఫైటర్ మోటర్‌సైకిల్.. కేటీఎం 390 డ్యూక్, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, బజాజ్ డామినర్ 400 వంటి మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 అనేది ఒక మిడిల్‌వెయిట్ స్ట్రీట్‌ఫైటర్ మోటర్‌సైకిల్. ఈ సెగ్మెంట్లో కేటీఎం, బీఎండబ్ల్యూ, బజాజ్ సంస్థల ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక ఈ లాంచ్‌తో.. సబ్-400 సీసీ కేటగిరీపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తోంది టీవీఎస్. ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉండటంతో.. రానున్న మోడల్స్ ప్రదర్శనపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310- ఫీచర్స్..
TVS Apache RTR 310 price : టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310లో బీఎస్6 ఆధారిత 312సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండనుంది. అపాచీ ఆర్ఆర్ 310లోనూ ఇదే ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 33.5హెచ్‌పీ పవర్‌ను, 27.3ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇక డిజైన్ పరంగా చూసుకుంటే.. ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ లుక్ మస్క్యులర్‌గా ఉండొచ్చు. యాంగ్యులర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాప్ విత్ డీఆర్ఎల్స్, వైడ్ హ్యాండిల్‌బార్, స్పూకీ లుకింగ్ మిర్రర్స్, స్ప్లిట్- టైర్ సీట్స్, అప్స్వెప్ట్ ఎక్సాస్ట్, స్లిమ్ టెయిల్ సెక్షన్, స్ప్లిట్ టైర్ గ్రాబ్రెయిల్స్, లైట్‌వెయిట్ అలాయ్ వీల్స్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్ వంటి ఫీచర్స్ వచ్చే అవకాశం ఉంది.
TVS iQube ST: త్వరలో మార్కెట్లోకి టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ టీ. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TVS Apache RTR 310 : అపాచీ ఆర్ఆర్ 310లో బెస్ట్ ఇన్ క్లాస్ మిషిలిన్ రోడ్ టైర్స్ ఉంటాయి. త్వరలో రానున్న టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310లోనూ ఇవే ఉండొచ్చు. మిడిల్‌వెయిట్ సెగ్మెంట్లో ఈ టైర్స్ ది బెస్ట్ అని ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాయి. పర్ఫార్మెన్స్, బ్యాలెన్స్‌తో పాటు లాంగ్ లైఫ్ కూడా ఉండటం విశేషం.
2023 TVS Apache RTR 310 launch : ఇక ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర వంటి వివరాలను సంస్థ ప్రకటించాల్సి ఉంది. త్వరలనే దీనిపై మరింత సమాచారం బయటకొచ్చే అవకాశం ఉంది.
సంబంధిత కథనం