HDFC Bank Q2 Results: క్యూ 2 లో 5.3% పెరిగి, రూ.16,821 కోట్లకు చేరిన హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ నికర లాభం
HDFC Bank Q2 Results: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శనివారం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింద. ఈ క్యూ 2 లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 16,821 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. ఇది గత సంవత్సరం క్యూ2 లాభాలతో పోలిస్తే, 5.3% అధికం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్యూ 2 రిజల్ట్స్
HDFC Bank Q2 Results: ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (Q2FY25) ఫలితాలను హెచ్డీఎఫ్సీ బ్యాంక్ శనివారం ప్రకటించింది. బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 5.3 శాతం పెరిగి రూ .16,821 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్ఐఐ) అంటే ఆర్జించిన వడ్డీకి, చెల్లించిన వడ్డీకి మధ్య వ్యత్యాసం 10 శాతం పెరిగి రూ.27,390 కోట్ల నుంచి రూ.30,110 కోట్లకు పెరిగింది.
2023 జూలై తరువాత ఇప్పుడే.
2023 జూలైలో మాతృసంస్థ హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (HDFC)తో విలీనం పూర్తయిన తర్వాత హెచ్డీఎఫ్సీ వార్షిక (YoY) గణాంకాలను పోల్చడం ఇదే తొలిసారి. విలీనం వల్ల హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పోర్ట్ ఫోలియోలో పెద్ద మొత్తంలో రుణాలు చేరాయి. కానీ, తక్కువ మొత్తంలో డిపాజిట్లు యాడ్ అయ్యాయి. ఇది, క్యూ 2 ఫలితాలపై ప్రభావం చూపింది.
హెచ్ డిఎఫ్ సి క్యూ2 ఫలితాలు: కీలకాంశాలు
- మార్కెట్ విలువ ప్రకారం భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC BANK) ప్రధాన నికర వడ్డీ మార్జిన్ (NIM) మొత్తం ఆస్తులపై 3.46 శాతం, వడ్డీ ఆర్జించే వాటిపై 3.65 శాతంగా ఉంది. ఇది గత త్రైమాసికంలో వరుసగా 3.47 శాతం, 3.66 శాతంగా ఉంది.
- అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.67,698 కోట్ల వడ్డీ ఆదాయంతో పోలిస్తే, ఈ క్యూ 2 లో వడ్డీ ఆదాయం రూ.74,017 కోట్లుగా నమోదైంది. క్యూ 2 లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ .78,406 కోట్ల నుండి రూ .85,500 కోట్లకు పెరిగింది.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆస్తుల నాణ్యత కొద్దిగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 2024 సెప్టెంబర్ చివరి నాటికి స్థూల రుణాలలో 1.36 శాతానికి పెరిగాయి. నికర ఎన్పీఏలు లేదా మొండిబకాయిలు గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసే సమయానికి 0.35 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగాయి.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మొత్తం బ్యాలెన్స్ షీట్ రూ.34,16,300 కోట్ల నుంచి రూ.36,88,100 కోట్లకు పెరిగింది. మొత్తం డిపాజిట్లు 15.1 శాతం పెరిగి రూ.25,00,100 కోట్లకు చేరుకోగా, కాసా డిపాజిట్లు 8.1 శాతం పెరిగాయి. సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లు రూ.6,08,100 కోట్లు, కరెంట్ అకౌంట్ డిపాజిట్లు రూ.2,75,400 కోట్లుగా ఉన్నాయి.
- సెప్టెంబర్ 30, 2024 త్రైమాసికంలో ప్రొవిజన్స్, కంటింజెన్సీలు రూ.2,700 కోట్లు కాగా, 2023 ఇదే త్రైమాసికంలో రూ.2,900 కోట్లుగా ఉన్నాయి. మొత్తం రుణ వ్యయ నిష్పత్తి 2023 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో 0.49 శాతంతో పోలిస్తే 0.43 శాతంగా ఉంది. ఈ త్రైమాసికంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్వహణ వ్యయాలు రూ.15,400 కోట్ల నుంచి 9.7 శాతం పెరిగి రూ.16,890 కోట్లకు చేరుకున్నాయి.
- జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంక్ స్థూల అడ్వాన్సులు ఏడు శాతం పెరిగి రూ.25.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. రిటైల్ రుణాలు 11.3 శాతం, వాణిజ్య, రిటైల్ బ్యాంకింగ్ 17.4 శాతం పెరిగాయి. కార్పొరేట్, ఇతర హోల్సేల్ రుణాలు మాత్రం 12 శాతం తగ్గాయి. మొత్తం అడ్వాన్స్ లలో ఓవర్సీస్ అడ్వాన్సులు 1.7 శాతంగా ఉన్నాయి.
మరిన్ని స్టాక్‌మార్కెట్, కంపెనీల ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, గాడ్జెట్లు, స్మార్ట్ఫోన్లు, టెక్నాలజీ, గోల్డ్ ప్రైస్ తదితర తాజా వార్తలను చూడండి.