ధన త్రయోదశి రోజున రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2500 కోట్ల విలువైన వెండి అమ్మకాలు-gold worth 20000 crore rupees silver worth 2500 crore rupees sold on dhanteras know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ధన త్రయోదశి రోజున రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2500 కోట్ల విలువైన వెండి అమ్మకాలు

ధన త్రయోదశి రోజున రూ.20,000 కోట్ల విలువైన బంగారం, రూ.2500 కోట్ల విలువైన వెండి అమ్మకాలు

Anand Sai HT Telugu
Oct 30, 2024 08:00 AM IST

Dhanatrayodashi Gold Sales : ఈ ఏడాది ధంతేరాస్ రోజున సుమారు రూ.60 వేల కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. దేశవ్యాప్తంగా సుమారు 20 వేల కోట్ల బంగారం, 2500 కోట్ల వెండి కొనుగోలు జరిగింది. సుమారు 25 టన్నుల బంగారాన్ని విక్రయించారు.

ధన త్రయోదశి బంగారం, వెండి అమ్మకాలు
ధన త్రయోదశి బంగారం, వెండి అమ్మకాలు

ధన త్రయోదశి సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లలో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్ పరికరాలు, పాత్రలు, దుస్తులు వంటి ఇతర ఉత్పత్తుల విక్రయాలు జోరుగా సాగాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఏఐటీ) ప్రకారం ఈ ఏడాది ధంతేరాస్ సుమారు 60 వేల కోట్ల రూపాయల వ్యాపారం చేసిందని అంచనా. గత ఏడాది సుమారు రూ.50 వేల కోట్ల టర్నోవర్ ఉంది. ఈ ఏడాది పండగ వ్యాపారం చాలా వృద్ధి సాధించిందని నిపుణులు చెబుతున్నారు.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆల్ ఇండియా జ్యువెల్లర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా మాట్లాడుతూ ధరలు పెరిగినప్పటికీ.. ఈ ధన త్రయోదశి రోజున బంగారం, వెండి అమ్మకాలు విపరీతంగా జరిగాయని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 20 వేల కోట్ల బంగారం, 2500 కోట్ల వెండి కొనుగోలు జరిగింది. రూ.20 వేల కోట్ల విలువైన 25 టన్నుల బంగారాన్ని విక్రయించారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా 250 టన్నుల వెండిని విక్రయించగా, దీని విలువ సుమారు రూ.2,500 కోట్లు. గత ఏడాది టర్నోవర్ రూ.25,000 కోట్లుగా ఉంది.

దేశవ్యాప్తంగా మార్కెట్లలో వోకల్ ఫర్ లోకల్ ప్రభావం కనిపించిందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ తెలిపింది. చైనా వస్తువుల కొనుగోళ్లు తక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని కొనుగోళ్లు భారతీయ వస్తువులవే కావడం గమనార్హం. ఒక అంచనా ప్రకారం దీపావళికి సంబంధించి చైనా వస్తువుల అమ్మకాలు తగ్గడంతో చైనా సుమారు లక్షా 25 వేల కోట్ల రూపాయల విలువైన వాణిజ్యాన్ని కోల్పోయింది.

ధన త్రయోదశి రోజున కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 20 నుంచి 25 శాతం పెరిగినట్టుగా ఆటో ఇండస్ట్రీ బాడీ ఫాడా అంచనా వేసింది. దసరా సందర్భంగా 5 నుంచి 12 శాతం వరకు పెరిగాయి. దీపావళి రోజున ఈ అమ్మకాల సంఖ్య దాదాపు రెట్టింపు అవుతుంది. కార్ల అమ్మకాలు 10 శాతం, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 15 శాతం పెరిగే అవకాశం ఉంది.

రిఫ్రిజిరేటర్లు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు 20 నుంచి 30 శాతం వరకు పెరగొచ్చని ఇండస్ట్రీ బాడీ సీఈఎంఏ తెలిపింది. నగరాల్లో ఖరీదైన ఉపకరణాల (ప్రీమియం) అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రాపర్టీ అమ్మకాలు 5 శాతం నుంచి 20 శాతం పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కోటి రూపాయలకు పైబడిన ఇళ్లకు డిమాండ్ పెరిగింది.

Whats_app_banner