Get a free Tesla car: బంపర్ ఆఫర్; ఫ్రీ టెస్లా కార్
Get a free Tesla car: ‘కొత్త ఇల్లు, కొత్త కారు’ యాడ్ గుర్తుందా? అలాంటి ఆఫర్ నే ఈ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఇస్తున్నారు. ఈ 7 బెడ్ రూమ్ బంగళాను కొంటే ఫ్రీగా బ్రాండ్ న్యూ టెస్లా కార్ ను ఇస్తామంటున్నారు.
Get a free Tesla car: ఈ ఆఫర్ ఇక్కడ కాదు. న్యూజీలాండ్ లో. అక్కడి ప్రముఖ నగరాల్లో ఒకటైన ఆక్లాండ్ శివార్లలోని విల్లాకు సంబంధించిన సేల్ యాడ్ లో ఈ ఆఫర్ ఇచ్చారు.
free Tesla car offer: బ్రాండ్ న్యూ టెస్లా కార్
ఆక్లాండ్ శివార్లలోని ఖరీదైన ప్రాంతంలో ఈ 7 బెడ్ రూమ్ బంగళా ఉంది. దీని అమ్మకానికి సంబంధించిన ప్రకటనలోనే ఈ ఆఫర్ ఇచ్చారు. ఆ విల్లాను కొనుగోలు చేసిన వారికి టెస్లా బ్రాండ్ కు చెందిన సరికొత్త మోడల్ ‘వై’ కారును ఉచితంగా ఇస్తామని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ థామ్సన్, బర్ఫూట్ లు ప్రకటన ఇచ్చారు.
slump in real estate business: అయినా నో గ్రేట్ రెస్పాన్స్..
ఈ స్థాయిలో బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ.. కొనుగోలుదార్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడం విశేషం. ప్రస్తుతం న్యూజీలాండ్ లో రియల్ ఎస్టేట్ పరిస్థితి దారుణంగా ఉంది. గృహ రుణాల వడ్డీ రేట్లను భారీగా పెంచారు. దాంతో గత సంవత్సరం లోన్ తో ఇల్లు కొనుగోలు చేసినవారు తమ నెలవారీ ఆదాయంలో సగానికి పైగా ఈ లోన్ నెలవారీ వాయిదాకే చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు, కరోనా వల్ల నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం న్యూజీలాండ్ లో తీవ్రంగా ఉంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారీ వడ్డీ రేటుతో లోన్ తీసుకుని ఇల్లు కొనుగోలు చేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సరికాదని న్యూజీలాండ్ ప్రజలు భావిస్తున్నారు.