Forgot iPhone 15 passcode: మీ ఐ ఫోన్ 15 పాస్ కోడ్ మర్చిపోయారా? ఈ స్టెప్స్ తో అన్ లాక్ చేసుకోండి..
Forgot your iPhone 15 passcode?: సరికొత్త ఐ ఫోన్ 15 పాస్ కోడ్ ను మర్చిపోయారా? ఈ కింది స్టెప్స్ తో మీ ఐ ఫోన్ 15 ను అన్ లాక్ చేసుకోవచ్చు. అయితే, అందుకు మీ వద్ద మ్యాక్ కానీ, పీసీ కానీ ఉండాలి.
Forgot your iPhone 15 passcode?: ఈ సాంకేతిక యుగంలో, స్మార్ట్‌ఫోన్ లేని జీవితాన్ని ఊహించలేం. స్మార్ట్ ఫోన్ మన జీవితంలో విడిచి ఉండలేనిదిగా మారిపోయింది. ఇప్పుడు దాదాపు అన్ని దైనందిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ నుంచే జరుగుతున్నాయి.
ఐ ఫోన్ సెక్యూరిటీ..
సెక్యూరిటీ పరంగా ఐ ఫోన్ మిగతా స్మార్ట్ ఫోన్స్ కన్నా చాలా పై స్థాయిలో ఉంటుంది. కానీ, ఐ ఫోన్ పాస్‌కోడ్‌ను మరచిపోతే అది పీడకలలా మారుతుంది. ఆ పాస్ కోడ్ ను మళ్లీ పొందడం దాదాపు అసాధ్యమనే భావనలో చాలా మంది ఉంటారు. కానీ అది నిజం కాదు. సింపుల్ స్టెప్స్ తో ఐ ఫోన్ పాస్ కోడ్ ను తిరిగి పొందవచ్చు. మీరు ఇటీవల iPhone 15ని కొనుగోలు చేసి, మీ పాస్‌కోడ్‌ను మరచిపోయినట్లయితే భయపడవద్దు. కింది స్టెప్స్ ఫాలో అవండి. మీ ఐ ఫోన్ 15 ను అన్ లాక్ చేసుకోండి.
Step 1. ఒక కంప్యూటర్ కావాలి
మీరు మర్చిపోయిన పాస్ కోడ్ ను తిరిగి పొందడానికి మీ వద్ద కనీసం ఒక మ్యాక్ లేదా పీసీ ఉండాలి. ఒకవేళ అది పీసీ అయితే, అందులో విండోస్ 10 యాక్టివేట్ అయి ఉండాలి. ఒకవేళ అది మ్యాక్ అయితే, అందులో ఐ ట్యూన్స్ ఇన్ స్టాల్ అయి ఉండాలి. అలాగే, మీ ఐఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయడానికి మీకు అనుకూలమైన కేబుల్ కూడా అవసరం. ఒకవేళ మీకు కంప్యూటర్ లేకపోతే, సహాయం కోసం Apple రిటైల్ స్టోర్ లేదా Apple అధీకృత సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
Step 2: మీ ఐ ఫోన్ 15 ను స్విచ్ ఆఫ్ చేయండి
మీ ఐ ఫోన్ ను పీసీతో కానీ, మ్యాక్ తో కాని కనెక్ట్ చేసిన తరువాత, మీ ఐఫోన్ మోడల్‌కు తగిన పద్ధతిని ఉపయోగించి మీ iPhoneని ఆఫ్ చేయండి. iPhone 8, iPhone 8 Plus, iPhone X మరియు తదుపరి మోడల్‌ల కోసం (iPhone SE 2వ మరియు 3వ తరంతో సహా), పవర్-ఆఫ్ స్లయిడర్ కనిపించే వరకు సైడ్ బటన్, వాల్యూమ్ డౌన్ బటన్ రెండింటినీ నొక్కి పట్టుకోవాల్సి ఉంటుంది.
Step 3: రికవరీ మోడ్
మీ ఐ ఫోన్ ను రికవరీ మోడ్ లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. రికవరీ మోడ్ లోకి ఏ బటన్ ను ప్రెస్ చేయాలో మీ యూజర్ మ్యాన్యువల్ లో ఉంటుంది. ఇది మోడల్స్ ను బట్టి మారుతూ ఉండవచ్చు.
Step 4: రీ స్టోర్ చేయండి
మీ ఐఫోన్‌ను కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి. ఫైండర్ లేదా ఐట్యూన్స్‌లో దాన్ని గుర్తించండి. ప్రాంప్ట్ చేసినప్పుడు “Restore” ఆప్షన్ ను ఎంచుకోండి. మీ కంప్యూటర్ మీ iPhone కోసం అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేస్తుంది. అనంతరం రీస్టోర్ ప్రక్రియను ప్రారంభిస్తుంది. డౌన్‌లోడ్ చేయడానికి 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకున్నా, లేదా మీ ఫోన్ రికవరీ మోడ్ నుండి నిష్క్రమించినా, డౌన్‌లోడ్ పూర్తి కానివ్వండి, ఆపై మీ iPhoneని ఆఫ్ చేసి, ప్రాసెస్‌ను మళ్లీ ప్రారంభించండి. రీస్టోర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండండి. పూర్తయిన తర్వాత, మీ ఐ ఫోన్ పై సెటప్ స్క్రీన్ డిస్ ప్లే అవుతుంది. అనంతరం, కంప్యూటర్ నుండి మీ ఐఫోన్‌ను డిస్‌కనెక్ట్ చేసి, సెటప్ చేసి ఉపయోగించడం ప్రారంభించండి.
ఈ స్టెప్స్ ను ఫాలో కావడం ద్వారా మీ ఐ ఫోన్ ను విజయవంతంగా అన్ లాక్ చేసుకోవచ్చు. మీ డేటా కూడా బ్యాకప్ అవుతుంది.