Offers on AC's in flipkart : ఇండియాలో భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఐఎండీ కూడా హీట్‌వేవ్ హెచ్చరికలు ఇచ్చేసింది. ఈ ఎండలో చల్లగా ఉండేందుకు చాలా మంది ఏసీ కొనాలని భావిస్తున్నారు. కానీ భారీగా పెరిగిపోయిన రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? ఇక బాధ పడాల్సిన అవసరం లేదు. దేశీయ దిగ్గజ ఆన్లైన్ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏసీలపై డిస్కౌంట్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో రూ. 40వేల లోపు అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఏసీలపై ఓ లుక్కేద్దాము..
Blue Star Convertible 4 in 1 Cooling 1.5 Ton 3 Star : ఈ 1.5 టన్ బ్లూ స్టార్ ఏసీ ధర రూ. 36,190. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కస్టమర్లు 10శాతం ఆఫర్స్ పొందవచ్చు. ఈ ఏసీలో 4 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది. ఫలితంగా దీని పర్ఫార్మెన్స్ అదిరిపోతుంది. సెల్ఫ్ డయగ్నాసిస్, డస్ట్ ఫిల్టర్, స్టెబులైజర్ ఫ్రీ ఆపరేషన్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Samsung Convertible 5-in-1 Cooling 1.5 Ton 3 Star price : ఈ 1.5 టన్ శాంసంగ్ ఏసీ ధర రూ. 35,499. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 10శాతం లేదా రూ. 1500 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఇందులో 5 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది.
LG AI Convertible 6 in 1 Cooling 1.5 Ton 3 Star AC price : ఈ 1.5 టన్ ఎల్జీ ఏసీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 37,990కి లభిస్తోంది. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10శాతం లేదా రూ. 1500 వరకు ఆఫర్స్ పొందొచ్చు. ఇందులో 6 ఇన్ 1 కూలింగ్ మోడ్ ఉంటుంది. ఏఐ డ్యూయెల్ ఇన్వర్టర్ 2 వే స్వింగ్, హెచ్డీ ఫిల్టర్ విత్ యాంటీ వైరస్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ దీని సొంతం.
Voltas 1.5 Ton 3 Star Split Inverter AC price : ఈ వోల్టాస్ ఏసీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 33,490కి లభిస్తోంది. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10శాతం లేదా రూ. 1,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఏసీలో ఆటో అడ్జెస్టెబుల్ టెంపరేచర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Whirlpool Convertible 4-in-1 Cooling 1.5 Ton 3 Star price : ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఏసీ ధర రూ. 32,499గా ఉంది. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్‌పై రూ. 1,500 లేదా 10శాతం వరకు కస్టమర్లు ఆఫర్స్ పొందొచ్చు.
సంబంధిత కథనం